Medical Test For Weight Gain: నేటి కాలంలో బరువు తగ్గడం చాలా కష్టంగా మారింది. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది ఊబకాయానికి గురవుతున్నారు. ఊబకాయం మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బుల వంటి ప్రమాదకరమైన వ్యాధులకు దారితీస్తుంది. చాలా మంది వ్యాయామం, డైటింగ్ ద్వారా బరువు తగ్గడానికి ప్రయత్నించినప్పటికీ, కొన్నిసార్లు ఫలితం ఉండకపోవచ్చు. అది కాకపోతే మందులు, చికిత్సలు తీసుకున్న తరువాత కూడా చాలా మంది అధిక బరువు బారిన పడుతున్నారు. అయితే దీనికి కారణాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం.
బరువు తగ్గకపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చని న్యూట్రిషనిస్ట్‌లు చెబుతున్నారు. అయితే బరువు తగ్గడానికి చాలా మంది వ్యాయామం, మందులు ఉపయోగించిన తరువాత కూడా ఊబకాయం బారిన పడుతున్నారు. అయితే దీని కారణాలు ఎన్నో ఉన్నాయి. అయితే మీరు ఎందుకు బరువు పెరుగుతున్నారు అనే విషయాని తెలుసుకోవాలి అంటే తప్పకుండా ఈ రక్త పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.
పరీక్షలు:
ఇన్ఫ్లమేషన్: శరీరంలో వాపు బరువు తగ్గడానికి అడ్డంకిగా మారవచ్చు. శరీరంలో వాపును గుర్తించడానికి సి-రియాక్టివ్ ప్రోటీన్ (CRP) పరీక్ష చేయించుకోండి.
CRP పరీక్ష కారణంగా బరువు తగ్గడానికి కలిగే ఇబ్బందులు ఏంటో మనం సులువుగా తెలుసుకోవచ్చని చెబుతున్నారు.
విటమిన్ డి: శరీరంలో విటమిన్ డి లోపం కూడా బరువు తగ్గడంలో ఇబ్బంది కలిగిస్తుంది. మీరు బరువు తగ్గకపోతే ఖచ్చితంగా విటమిన్ డి పరీక్ష చేయించుకోండి.
థైరాయిడ్: థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు కూడా బరువు తగ్గడంలో చాలా ఇబ్బందులు పడుతుంటారు. థైరాయిడ్ సమస్యలను గుర్తించడానికి T3, T4, TSH పరీక్షలు చేయించుకోండి.
షుగర్ టెస్ట్: రక్తంలో చక్కెర నియంత్రణలో లేకపోతే బరువు తగ్గడం కష్టం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తెలుసుకోవడానికి హెచ్‌బీఏ1సీ టెస్ట్ చేయించుకోండి.
బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ క్రింది రక్త పరీక్షలు చేయించుకోవడం మంచిది:
CRP పరీక్ష
విటమిన్ డి పరీక్ష
T3, T4, TSH పరీక్షలు
హెచ్‌బీఏ1సీ పరీక్ష
ఈ పరీక్షల ఫలితాల ఆధారంగా మీ డాక్టర్ మీకు సరైన చికిత్సను అందిస్తారు. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్లయితే, ఈ రక్త పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఈ పరీక్షల ద్వారా మీరు బరువు తగ్గకపోవడానికి గల కారణాలను గుర్తించి, తగిన చికిత్స తీసుకోవచ్చు.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి