Corona Third Wave: చిన్నారులపై కరోనా థర్డ్‌వేవ్..ఆధారాల్లేవంటున్న నీతి ఆయోగ్

Corona Third Wave: కరోనా థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉంది. కొన్ని ప్రాంతాల్లో చిన్నారులకు కరోనా సోకడం ఆందోళన రేపుతోంది. ఇంతకీ కరోనా థర్డ్‌వేవ్ ప్రభావం చిన్నారులపై ఉంటుందా లేదా..నీతి ఆయోగ్ ఏం చెబుతోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 8, 2021, 01:36 PM IST
Corona Third Wave: చిన్నారులపై కరోనా థర్డ్‌వేవ్..ఆధారాల్లేవంటున్న నీతి ఆయోగ్

Corona Third Wave: కరోనా థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉంది. కొన్ని ప్రాంతాల్లో చిన్నారులకు కరోనా సోకడం ఆందోళన రేపుతోంది. ఇంతకీ కరోనా థర్డ్‌వేవ్ ప్రభావం చిన్నారులపై ఉంటుందా లేదా..నీతి ఆయోగ్ ఏం చెబుతోంది.

కరోనా మహమ్మారి (Corona Pandemic) తగ్గుముఖం పడుతోంది. దేశాన్ని విలవిల్లాడించిన కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) నుంచి తేరుకోకముందే కరోనా థర్డ్‌వేవ్ ప్రమాదం హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇప్పటికే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో చిన్నారులకు కరోనా సోకడంపై ఆందోళన కలుగుతోంది. కరోనా ధర్డ్‌వేవ్ ప్రభావం చిన్నారులపై ఉంటుందనడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

కరోనా థర్డ్‌వేవ్ (Corona Third Wave) పిల్లలపై ఎటువంటి ప్రభావం చూపదని వీకే పాల్ తెలిపారు. ఏ వేవ్ కూడా ప్రత్యేకంగా చిన్నారుల్నే టార్గెట్ చేస్తుందనడానికి ఆధారాల్లేవని ఆయన చెప్పారు. కరోనా కేసులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పిల్లల్లో పెరుగుతుండటంతో చాలామంది ఆందోళన చెందుతున్నారు. పిల్లలపై కరోనా వేవ్ ప్రభావం చూపుతుందనేందుకు ఎలాంటి కచ్చితమైన ఆధారాల్లేవని చెప్పారు. పెద్దవారిలో సిరోప్రివలెన్స్ ఎలా ఉందో పిల్లల్లోనూ అలానే ఉందని..పెద్దవారిలానే పిల్లలు కూడా కరోనా బారిన పడే అవకాశాలున్నాయని నీతి ఆయోగ్(Niti Ayog) సభ్యుడు వీకే పాల్ తెలిపారు. అంతే గానీ..ప్రత్యేకంగా పిల్లలపైనే ప్రభావం ఉంటుందని చెప్పేందుకు కచ్చితమైన ఆధారాల్లేవని చెప్పారు. థర్డ్‌వేవ్ చిన్నారుల్నే టార్గెట్ చేస్తుందనేందుకు సైంటిఫిక్ ఆధారాల్లేవని ఇప్పటికే ఇండియన్ పీడియాట్రిక్ అసోసియేషన్ తెలిపింది. తల్లిదండ్రులు వ్యాక్సిన్ తీసుకుంటే పిల్లల్లో కరోనా వైరస్ సంక్రమణను కొంతమేరకు అడ్డుకోవచ్చంటున్నారు.

Also read: AIIMS Delhi Covaxin Trials: నేటి నుంచి చిన్నారులపై Bharat Biotech క్లినికల్ ట్రయల్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News