Monsoon Skin Care: వర్షాకాలంలో ముఖ సౌందర్యానికి అద్భుతమైన ఫేస్‌ప్యాక్ ఇదే, ఎలా చేయాలంటే

Monsoon Skin Care: వేసవి నుంచి వర్షాకాలంలోకి వచ్చేశాం. వర్షాకాలంలో సహజంగానే అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. అదే సమయంలో చర్మ సంబంధిత సమస్యలు కూడా వెంటాడుతుంటాయి. ఈ సమస్యలకు చాలా సులభంగా చెక్ పెట్టవచ్చంటున్నారు ఆయుర్వేద పండితులు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 16, 2023, 07:32 PM IST
Monsoon Skin Care: వర్షాకాలంలో ముఖ సౌందర్యానికి అద్భుతమైన ఫేస్‌ప్యాక్ ఇదే, ఎలా చేయాలంటే

Monsoon Skin Care: వర్షాకాలం ఆరోగ్యమే కాకుండా చర్మ సంరక్షణ, సౌందర్య పరిరక్షణ కూడా చాలా అవసరం. వర్షాకాలంలో చర్మం చికాగ్గా ఉంటుంది. అటు డ్రైగా ఉండదు ఇటు తేమగా ఉండదు. మధ్యస్థంగా ఉండి చికాకు పుట్టిస్తుంది. ఈ సమస్యకు ఎలా చెక్ పెట్టాలనేది పరిశీలిద్దాం. దీనికోసం అద్భుతమై ఫేస్‌ప్యాక్ అందుబాటులో ఉండనుంది. ఆ వివరాలు మీ కోసం.

వర్షకాలంలో చర్మ సంరక్షణకై చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇవి సరైన ఫలితాలనివ్వకపోగా, దుష్పరిణామాలకు కారణమౌతుంటాయి. అందుకే వర్షాకాలం సమస్యల్ని పరిష్కరించేందుకు బెస్ట్ హోమ్ మేడ్ ఫేస్‌ప్యాక్ గురించి తెలుసుకుందాం..ఈ ఫేస్‌ప్యాక్ తయారీకు శెనగ పిండి, పెరుగు, రోజ్ వాటర్ ఉంటే సరిపోతుంది. ఈ మూడు వస్తువులతో చర్మం పూర్తిగా పరిశుభ్రమవడమే కాకుండా డీప్ నరిష్, గ్లోయింగ్ కోసం ఉపయోగపడుతుంది. ఇదే వర్షాకాలం స్పెషల్ ఫేస్‌ప్యాక్. వర్షాకాలంలో చర్మం చికాకుగా మారుతుంటుంది. చర్మం ఆయిలీగా మారుతుంటుంది. ఈ సమస్యను దూరం చేసేందుకు మార్కెట్‌లో చాలా రకాల ఉత్పత్తులు ఉన్నా రసాయనాలతో కూడుకుని ఉండటంతో దుష్పరిణామాలు ఎక్కువగా తలెత్తుతుంటాయి. అందుకే సాధ్యమైనంతవరకూ హోమ్ మేడ్ చిట్కాలతో ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు ప్రయత్నించాలి. మాన్‌సూన్ ఫేస్‌ప్యాక్ చర్మ సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది. ఫేస్‌ప్యాక్ తయారీకు శెనగపిండి, పెరుగు, రోజ్ వాటర్ అవసరమౌతుంది. చర్మాన్ని పూర్తిగా నరిష్ చేయడమే కాకుండా డీప్ నరిష్ సాధ్యమౌతుంది.

మాన్‌సూన్ స్పెషల్ ఫేస్‌ప్యాక్ తయారు చేసేందుకు ముందుగా ఓ గిన్నె తీసుకోవాలి. ఇందులో 3-4 చెంచాల శెనగపిండి వేయాలి. ఇందులో 1 చెంచా పెరుగు, 2 చెంచాల రోజ్ వాటర్ అవసరం. ఈ మూడింటినీ బాగా కలుపుకుని మిశ్రమంగా చేసుకోవాలి. వర్షాకాలంలో ఈ మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఆయిలీ స్కిన్ సమస్యలకు అద్భుతమైన పరిష్కారంగా చెప్పవచ్చు.

మాన్‌సూన్ స్పెషల్ ఫేస్‌ప్యాక్ రాసేందుకు ముందుగా ముఖాన్ని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత ఈ ఫేస్‌ప్యాక్‌ను ఓ బ్రష్ సహాయంతో ముఖానికి అప్లై చేయాలి. ఆ తరువాత దాదాపు 20-25 నిమిషాలుంచి అప్పుడు నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేస్తే మంచి ఫలితాలుంటాయి.

Also read: Hair Blackening Tips: జుట్టు మెరిసిపోతుందా, ఏ ఆయిల్స్ పనిచేయడం లేదా..ఇది ట్రై చేయండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News