Monsoon Health Tips: వానాకాలంలో ప్రతిరోజు రెండు ఈ లడ్డూలను తింటే ఎలాంటి ఇన్ఫెక్షన్లు మీ దరిదాపుల్లోకి రావు 

Monsoon Health Tips: రాగి ఓట్స్ పిండితో తయారుచేసిన లడ్డూలను ప్రతిరోజు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ లడ్డూలను తినడం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి.  

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 13, 2023, 08:20 PM IST
Monsoon Health Tips: వానాకాలంలో  ప్రతిరోజు రెండు ఈ లడ్డూలను తింటే ఎలాంటి ఇన్ఫెక్షన్లు మీ దరిదాపుల్లోకి రావు 

Monsoon Health Tips: రాగి పిండితో తయారుచేసిన ఆహారాలు తినడం వల్ల శరీరానికి ఎన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. భారతదేశవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా రాగి పిండిని వినియోగించే రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాలే ప్రధానమైనవి. పూర్వీకుల నుంచి ఈ పిండిని వినియోగిస్తూ వస్తున్నారు. రాగి పిండితో తయారుచేసిన జావ, రొట్టెలు ప్రతిరోజు అల్పాహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఈ రాగి పిండిలో ఓట్స్ కలిపి లడ్డూలుగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకొని తినడం వల్ల శరీరానికి ఇలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. 

ఆధునిక జీవన శైలి కారణంగా చాలామందిలో శరీర బలహీనత సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు రాగి పిండిలో ఓట్స్ కలిపి తయారుచేసిన లడ్డూలను తినడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు వాన కాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లను కూడా సులభంగా తగ్గిస్తాయి. ముఖ్యంగా చిన్నపిల్లలకు ఈ లడ్డూలను స్నాక్స్ గా ఇవ్వడం వల్ల శరీర అభివృద్ధి తో పాటు ఎముకలు కూడా దృఢంగా మారుతాయని నిపుణులు తెలిపారు. తరచుగా రోగ నిరోధక శక్తి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ రెండు పదార్థాలతో తయారు చేసిన లడ్డూలను ప్రతిరోజు తినాల్సి ఉంటుంది. ఈ లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో?, వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

రాగి, ఓట్స్ లడ్డూలకు కావాల్సిన పదార్థాలు:
✤ అర కప్పు ఓట్స్
✤ అర కప్పు నెయ్యి
✤ సరిపడా జీడిపప్పు
✤ ఒక కప్పు రాగి పిండి
✤ ఒక కప్పు బెల్లం తురుము

Also read: Chandrayaan 3: మరి కొద్దిగంటల్లో చంద్రయాన్ 3, కీలకమైన రిహార్సల్ విజయవంతం

రాగి, ఓట్స్ లడ్డు తయారీ విధానం:
✤ ఈ లడ్డూలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకోవాల్సి ఉంటుంది.
✤ తర్వాత ఈ బౌల్ ను స్టౌ పై పెట్టి అందులో అరకప్పు నెయ్యిని వేయాల్సి ఉంటుంది.
✤ దీని వేసిన తర్వాత తీసుకున్న జీడిపప్పును అందులో దోరగా వేయించాలి. ఇలా వేయించి మరో కప్పులోకి తీసుకోవాలి.
✤ తర్వాత అదే నెయ్యిలో రాగి పిండిని వేసి దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఓట్స్ను పిండిలా చేసి ఈ రాగి పిండి లోనే కలిపి మరో ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి.
✤ ఇలా రెండింటినీ వేయించుకున్న తర్వాత, తురుముకున్న బెల్లాన్ని అందులో వేయాలి.
✤ ఇలా బెల్లం తురుమును వేసిన తర్వాత, అందులోనే జీడిపప్పు వేసి లడ్డూల్లా చిన్న చిన్న ఉండలు కట్టుకోవాలి.
✤ ఇలా లడ్డూలు కట్టుకున్న తర్వాత 15 నిమిషాల పాటు పక్కనపెట్టి సర్వ్ చేసుకుని తినొచ్చు.

Also read: Chandrayaan 3: మరి కొద్దిగంటల్లో చంద్రయాన్ 3, కీలకమైన రిహార్సల్ విజయవంతం

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News