Monsoon Care Tips: వర్షాకాలంలో వీటిని వండుకునే క్రమంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎందుకో తెలుసా?

Monsoon Care Tips: వర్షాకాలంలో ఈ ఆహారాలను వండుకునే క్రమంలో తప్పకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన చిట్కాలు సలహాలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర ఇన్ఫెక్షన్లకు గురయ్యే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు తప్పకుండా ఈ చిట్కాలు పాటించాల్సి ఉంటుంది.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 26, 2023, 09:27 AM IST
Monsoon Care Tips: వర్షాకాలంలో వీటిని వండుకునే క్రమంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎందుకో తెలుసా?

Monsoon Care Tips: దేశవ్యాప్తంగా రుతుపవనాలు వ్యాపించాయి వ్యాపించాయి. దీంతో కొన్ని ప్రదేశాల్లో ఇప్పటికే వర్షాకాలం మొదలైంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే గత మూడు రోజుల నుంచి వర్షాలు దంచి కొడుతున్నాయి. వేసవి తాపం నుంచి ఉపశమనం లభించడంతో ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. మండే వేడి నుంచి శరీరం ఒక్కసారిగా చల్లబడడంతో అనేక రకాల సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ క్రమంలో శరీరాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో కీటకాల బెరద పెరిగి.. దీని ప్రభావం కూరగాయలపై పడుతుందని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో కూరగాయలు ఆహారంలో తీసుకునే క్రమంలో తప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

వానాకాలంలో ఆహారాలు తీసుకునే క్రమంలో తప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేదంటే సీజనల్ వ్యాధుల బారిన పడక తప్పదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో కీటకాల ప్రభావం రెట్టింపు అవుతుంది. కాబట్టి ఇవి ఆలిన కూరగాయలను తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ క్రమంలో ఆకుకూరలు తీసుకునేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. ఆ జాగ్రత్తలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read: Sarfaraz Khan: ఒక్క వీడియోతో బీసీసీఐకి ఇచ్చిపడేసిన సర్ఫరాజ్ ఖాన్   

వర్షాకాలంలో పాలకూర, మెంతికూర, పచ్చ కూర వంటి ఆకుకూరలు తీసుకునేవారు తప్పకుండా జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా ఆకుల పై రంధ్రాలు ఉంటే వాటిని తినకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కీటకాల ప్రభావం పడడం వల్లే ఆకులపై రంధ్రాలు ఏర్పడతాయని.. ఇలాంటి ఆకులను తినడం వల్ల డయేరియా వంటి సమస్యలకు దారి తీయవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా కాలీఫ్లవర్, క్యాబేజీలను తీసుకునే వారు కూడా పలు జాగ్రత్తలతో వండుకోవాల్సి ఉంటుంది. వానాకాలంలో వీటిలో క్రిముల శాతం పెరిగి, పురుగులు తయారయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

ముఖ్యంగా వానాకాలంలో పుట్టగొడుగులు తీసుకునేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎక్కువగా పుట్టగొడుగులు తీసుకోవడం వల్ల తీవ్ర పొట్ట సమస్యలకు దారి తీసే ఛాన్స్ కూడా ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. క్యాప్సికం తినే క్రమంలో కూడా తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి అవసరం ఎంతగానో ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also Read: Sarfaraz Khan: ఒక్క వీడియోతో బీసీసీఐకి ఇచ్చిపడేసిన సర్ఫరాజ్ ఖాన్   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x