Monsoon Health Tips: వర్షాకాలంలో వీటిని అస్సలు తినకూడదు.. అంతేకాకుండా ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి..!

Monsoon Health Tips: వర్షాకాలం వచ్చిందంటే మండుతున్న వేడి నుంచి శరీరానికి ఉపశమనం లభిస్తుంది. కానీ మారుతున్న రుతుపవనాల కారణంగా  అనేక వ్యాధులు కూడా వచ్చే అవకాశాలుంటాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 27, 2022, 09:52 AM IST
  • వర్షాకాలంలో జంక్‌ ఫుడ్‌ని అస్సలు తినకూడదు..
  • చాట్, పకోడీలు, గోల్ గప్పాలు లంటి చాట్‌ కూడా..
  • పాల ఉత్పత్తులకు దూరంగా ఉండండి
 Monsoon Health Tips: వర్షాకాలంలో వీటిని అస్సలు తినకూడదు.. అంతేకాకుండా ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి..!

Monsoon Health Tips: వర్షాకాలం వచ్చిందంటే మండుతున్న వేడి నుంచి శరీరానికి ఉపశమనం లభిస్తుంది. కానీ మారుతున్న రుతుపవనాల కారణంగా  అనేక వ్యాధులు కూడా వచ్చే అవకాశాలుంటాయి. ముఖ్యంగా పొట్టకు సంబంధించి సమస్యలు రావడం విశేషం. ఇలాంటి సందర్భంగా శరీరానికి రక్షించుకోవడం చాలా మంచిది లేదంటే ఈ చిన్న చిన్న సమస్యలు ప్రాణాంతకంగా మారే అవకాశాలున్నాయి. కావున ఈ సీజన్‌లో 8 రకాల జాగ్రత్తలు వహించాలని నిపుణులు తెలుపుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వీటిని తప్పకుండా పాటించండి:

1. వర్షాకాలంలో జీర్ణశక్తి బలహీనపడుతుంది. కావున జంక్‌ ఫుడ్‌ తినడం మానుకోండి. లేదంటే ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలకు దారితీస్తుంది.

2. బయట లభించే నీటిని అస్సలు తాగకూడదు. వాతావరణం మారుతున్న క్రమంలో నీరు కలుషితం కావచ్చు. వీటి వల్ల కామెర్లు సహా అనేక వ్యాధులు ఉత్పన్నమయో అవకాశాలున్నాయి.

3. వర్షాకాలంలో చాట్, పకోడీలు, గోల్ గప్పాలు తినడానికి ఇష్టపడతారు. కానీ ఈ సీజన్‌లో వీటిని అస్సలు తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. వీటి వల్ల కడుపు ఇన్ఫెక్షన్‌కు దారీ తియోచ్చు.

4. వానా కాలంలో శీతల పానీయాలను అస్సలు తాగొద్దు. దీని కారణంగా కడుపు నొప్పి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి.

5. పాల ఉత్పత్తులకు దూరంగా ఉండండి.

6. బయట లభించే పండ్ల రసాలను మానుకోండి. దుకాణదారులు పండ్లను కోసి గంటల తరబడి ఉంచడం వల్ల అవి కలుషితంగా మారొచ్చు.

7. వర్షాకాలంలో ఆకు కూరలను తినకూడదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వాతావరణం మార్పుల కారణంగా ఆకులపై కీటకాలు చేరే అవకాశాలున్నాయి.  కావున వీటిని వండే క్రమంలో నీటిని ఉడకబెట్టిన తరువాత వండుకోవడం చాలా మేలు.

8. వర్షాకాలంలో సీ-ఫుడ్ తీసుకోకూడదు.

వర్షాకాలంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి:

1. వర్షాకాలంలో నీరును పుష్కలంగా తాగండి.

 2. గ్రీన్ టీ, అల్లం టీ, హెర్బల్ టీని ఉదయం పూట, సాయంత్రం పూట తాగండి.

3. పొట్లకాయ, మెంతి గింజలను అధికంగా తినండి. ఇది జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది.

(గమనిక: ఈ కథనం సాధారణ సమాచారం, సలహా ఆధారంగా అందించబడింది. అర్హత కలిగిన వైద్యని అభిప్రాయానికి ఇది ఏ విధంగానూ ప్రత్యామ్నాయం కాదు. మరిన్ని వివరాల కోసం ఎల్లప్పుడూ వైద్యుడిని లేదా నిపుణుడిని సంప్రదించండి. )

 

Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు ఊరట.. స్థిరంగా బంగారం, వెండి ధరలు!

Also Read: Telangana Weather Forecast: తెలంగాణలో నేడు, రేపుఓ మోస్తరు వర్షాలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 

Trending News