వీడియో కాలింగ్ ద్వారా ఇంట్లోనే ఆరోగ్య సంరక్షణ

జలుబు, దగ్గు, జ్వరం, నరాల బలహీనత, కండరాల నొప్పులు.. వంటి రోగాలు వస్తే ఇంటి నుంచి బయటకు వచ్చి ఏదో వాహనం మీద హాస్పిటల్‌కు వెళ్ళాలి. 

Last Updated : Jan 21, 2018, 09:38 AM IST
వీడియో కాలింగ్ ద్వారా ఇంట్లోనే ఆరోగ్య సంరక్షణ

జలుబు, దగ్గు, జ్వరం, నరాల బలహీనత, కండరాల నొప్పులు.. వంటి రోగాలు వస్తే ఇంటి నుంచి బయటకు వచ్చి ఏదో వాహనం మీద హాస్పిటల్‌కు వెళ్ళాలి. అక్కడ డాక్టర్‌ను సంప్రదించాలి .అవునా? కాగా ఇదంతా మీకు వ్యయప్రయాస అనిపించవచ్చు. అందుకే కేరళలో వైద్య సేవల విషయంలో ఓ వినూత్న కార్యక్రమం చేపట్టారు. వీడియో కాలింగ్‌తో జనాలకు ఆరోగ్య భరోసా ఇస్తున్నారు. అదేంటో మనమూ చూద్దాం.!!

వరపూజ ప్రాంతంలో ఓ  చిన్న ద్వీపం ఉంది. దాని పేరు కరిక్కట్టుతురుత్. ఈ ఊరిలో ఓసారి ఇంట్లోనే పాలియేటివ్ కేర్ పొందుతున్న వృద్ధురాలిని సందర్శించిన నర్సు, ఆమెకి మోకాళ్ళలో నొప్పిగా ఉన్నట్లు డాక్టర్ జి. మోహన్ కు వీడియో కాలింగ్ ద్వారా తెలిపింది. డాక్టర్ టాబ్లెట్ పిసి ద్వారా నేరుగా రోగితో సంభాషించి, ఆరోగ్యం గురించి భరోసా ఇచ్చాడు. ఆ తర్వాత అదే డాక్టర్ ఇంటివద్దే ఉండే రోగుల కోసం కేరళలోని ఎర్నాకుళం జనరల్ హాస్పిటల్లో 'వరల్డ్ హాస్పైస్ అండ్ పాలియేటివ్ కేర్ డే' రోజున టెలీ కన్సల్టేషన్ విధానం ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ మోహన్ మాట్లాడుతూ-  "కేవలం ఐదు బిఎస్ఎన్ఎల్ కనెక్షన్లు ఉన్న టాబ్లెట్‌‌లతో ఈ విధానాన్ని ప్రారంభించారు. ఇది గృహ సంరక్షణలో ఉన్న 960 మందికి పైగా రోగులకు ఉత్తమ సేవలందించేలా మాకు సహాయపడుతుందని ఆశిస్తున్నాము" అని అన్నారు. 

"ఈ ప్రాజెక్టుకు జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్ హెచ్ ఎమ్) నిధులు సమకూర్చింది. కొచ్చి రిఫైనరీ కూడా మద్దతిచ్చింది. నర్సులు, ట్రైనీ వైద్యులు, స్వయంసేవకులు స్వయంగా గృహ సంరక్షణలో ఉన్న రోగులను చూసి వారికి  మానసిక, వైద్య సహాయాన్ని అందిస్తారు. అన్నిసార్లు వారికీ కావాల్సింది ఔషధం కాదు. వారికి మాట్లాడటానికి వ్యక్తి అవసరం. అతను వారికి భరోసా ఇస్తాడు. గాయాలతో బాధపడుతున్న రోగుల కుటుంబాలకూ పాలియేటివ్ కేర్ మద్దతుగా నిలుస్తుంది" అని డాక్టర్ మోహన్ తెలిపారు.  

ఎర్నాకుళం జనరల్ హాస్పిటల్‌లోని పాలియేటివ్ కేర్ యూనిట్‌లో శిక్షణ పొందిన డాక్టర్లు, హెల్త్ సైన్స్ విద్యావేత్తలు, 900 మంది వాలంటీర్లు ఉన్నారు. చివరి దశలో ఉన్న క్యాన్సర్ రోగులకు ఇన్ పేషేంట్ రక్షణను కూడా ఈ డాక్టర్ల టీమ్ అందిస్తోంది.

Trending News