Mango Leaves Health Benefits: అన్ని పండ్లలో మామిడి పండును 'రారాజు' అంటారు. వేసవి కాలంలో సమృద్ధిగా దొరికే మామిడి పండ్లు రుచికి రుచి, ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. మామిడి పండులో ఉండే విటమిన్ ఎ, బి, సిలతో పాటు పొటాషియం, కాపర్, మెగ్నిషియం, సాపోనిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఎంజైమ్స్.. మనిషి శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి. మామిడి పండుతో పాటుగా ఆకులు కూడా ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. అవేంటో ఓసారి చూద్దాం.
సాధారణంగా మామిడి ఆకులను మనం పూజలో ఉపయోగిస్తాం. కొన్ని వంటకాలలో కూడా వేస్తుంటాం. ఈ ఆకులు ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. ఇందులో విటమిన్ ఎ, బి, సి ఉంటాయి. అంతేకాదు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య సమస్యలను నివారించడానికి సహాయపడతాయి. మామిడి ఆకులు మధుమేహం మరియు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుతాయి. బరువు తగ్గాలనుకునే వారు, కంటి చూపు సరిగా లేని వారు కూడా మామిడి ఆకులను తినవచ్చు.
చక్కెర నియంత్రణ:
మామిడి ఆకులు డయాబెటిక్ పేషెంట్లకు ఎంతగానో ఉపయోగపడతాయి. రక్తంలో చక్కెర నియంత్రణలో ఈ ఆకులను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. 10-15 మామిడి ఆకులను తీసుకుని నీటిలో ఉడకబెట్టాలి. రాత్రంతా ఇలాగే ఉంచి.. ఉదయాన్నే నీటిని వడకట్టి వేరే పాత్రలో పోసుకొవాలి. ఖాళీ కడుపుతో రోజూ ఓ గ్లాస్ ఈ రసాన్ని తాగాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. అలానే రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
మూత్రపిండాలలోని రాళ్లు:
మూత్రపిండాలలో ఉన్న రాళ్లను తొలగించేందుకు మామిడి ఆకులు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. దీని కోసం ఒక గ్లాసు నీటిలో తీసుకుని అందులో ఒక చెంచా మామిడి ఆకుల పొడిని వేయాలి. రాత్రంతా ఇలాగే ఉంచి ఉదయాన్నే ఈ నీటిని తాగాలి. ఈ నీరు మూత్రపిండాల్లోని రాళ్లను తొలగించడంలో సహాయపడుతుంది.
పొట్ట సంబంధిత సమస్యలు:
పొట్ట సంబంధిత ఆరోగ్యానికి మామిడి ఆకులు సహాయపడతాయి. ఇందుకోసం మామిడి ఆకులను నీటిలో నానబెట్టి.. రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగాలి. పొట్ట సంబంధిత సమస్యల నుంచి బయటపడేందుకు ఈ నీరు ఓ మంచి ఔషధంలా పని చేస్తుంది.
జుట్టు పెరుగుదల:
జుట్టు పెరుగుదలలో మామిడి ఆకులు సహాయపడుతాయి. మామిడి ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు జుట్టు డ్యామేజ్ కాకుండా, పెరుగుదలకు సహకరిస్తాయి. అంతేకాదు జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు, కంటి చూపు సరిగా లేని వారు కూడా మామిడి ఆకులను తీసుకోవచ్చు.
Also Read: F3 OTT: ఎనిమిది వారాలకు ఓటీటీలోకి 'ఎఫ్ 3'.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే?
Also Read: Guru Purnima 2022: రేపు గురు పూర్ణిమ.. ఒకే రోజు 4 రాజ యోగాలు.. ఈ 3 రాశుల వారికి అదృష్టం..
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook
Mango Leaves Benefits: మామిడి ఆకుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.. తెలిస్తే ఆశ్చర్యపోతారు!
మామిడి ఆకుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా
తెలిస్తే ఆశ్చర్యపోతారు
కంటి చూపు సరిగా లేని వారు