Liver Disease Symptoms: ఆధునిక జీవన విధానంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. గుండె వ్యాధులు, డయాబెటిస్, కొలెస్ట్రాల్ కిడ్నీ, లివర్ వ్యాధులు ఇలాంటివే. వీటన్నింటిలో లివర్ వ్యాధి చాలా తీవ్రమైంది. ఎందుకంటే లివర్ పనితీరు సరిగ్గా లేకుంటే ఆ ప్రభావం ఇతర అవయవాలపై పడుతుంది. అందుకే లివర్ ఎలా ఉందనేది కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు.
మనిషి శరీరంలో లివర్ చాలా ముఖ్యమైంది. ఇందులో ఏ సమస్య ఉన్నా లివర్ పనితీరు మందగిస్తుంది. దాంతో ఇతర అవయవాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుకే లివర్ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రకాల లక్షణాలతో లివర్ ఏ మేరకు ఆరోగ్యంగా ఉందో తెలుసుకోవచ్చు. మీలో కూడా ఈ లక్షణాలు కన్పిస్తే మీ లివర్ ప్రమాదంలో ఉన్నట్టు అర్ధం. సకాలంలో చికిత్స చేయించకుంటే లివర్ దెబ్బతింటుంది. లివర్ ఆరోగ్యంగా లేకుంటే కన్పించే లక్షణాల్లో మొదటిది మూత్రం రంగు మారడం.ఇలా ఉంటే లివర్, కిడ్నీ రెండింట్లోనూ సమస్య ఉందని అర్ధం. ఎందుకంటే శరీరంలోని మలినాలు సరిగ్గా క్లీన్ కాకపోతే పిత్తరసం, లవణాలు ఎక్కువై మూత్ర విసర్జన, మలం సమయంలో బయటకు వస్తాయి. రోజుకు కావల్సినంత నీళ్లు తాగకపోయినా మూత్రం రంగు మారవచ్చు. నీళ్లు కావల్సినంతగా తాగకపోయినా మూత్రం రంగు మారుతుంటే లివర్‌లో సమస్య ఉందని అర్ధం.
ఇక చాలామంది తేలిగ్గా తీసుకునే లక్షణాలు కడుపులో నొప్పి, వికారం. ఈ రెండూ సాధారణ పరిస్థితుల్లోనూ కాకుండా లివర్ సమస్య ఉన్నప్పుడు కూడా ఉంటాయి. అందుకే ఈ రెండు లక్షణాలు కన్పిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుని సంప్రదించాలి. అంతేకాకుండా చేతులు, కాళ్లు వాపులుంటే లివర్ పనితీరు సరిగ్గా లేదని అర్ధం. వెంటనే వైద్యుని సంప్రదించాల్సి ఉంటుంది.
ఇక కళ్లు పసుపు పచ్చగా ఉంటే లివర్ సమస్య ఉందని అర్ధం. లివర్ సంబంధిత వ్యాధులైన కామెర్లు, హెపటైటిస్, లివర్ సిరోసిస్ వ్యాధులు ఈ కోవకు చెందినవే. లివర్ ఆరోగ్యం విషయంలో అందుకే ఆప్రమత్తంగా ఉండాలి.
Also read: EPFO Big Update: ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్, పెరగనున్న కనీస పెన్షన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి