Lemon Water Bath Health Benefits: రోజూ ఉదయాన్నే తలస్నానం చేయడం భారతీయుల సాంప్రదాయం. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే స్నానం చేసే క్రమంలో నీటిలో నిమ్మ రసాన్ని వినియోగిస్తే రెట్టింపు ప్రయోజనాలు పొందుతారని నిపుణులు తెలుపుతున్నారు. నిమ్మ రసంలో ఉండే యాంటీమైక్రోబయల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు వివిధ రకాల చర్మ సమస్యలను దూరం చేసేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో విటమిన్ సి అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి చర్మ సమస్యలకు చెక్ పెడుతుంది. అయితే ఈ నిమ్మ రసంతో స్నానం చేయడం వల్ల కూడా శరీరానికి చాలా లాభాలున్నాయి. ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
నీటిలో నిమ్మరసం వేసుకుని స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:
చర్మంపై ముడతలు పోతాయి:
వయసు పెరిగేకొద్దీ చర్మం వదులుగా మారడం సహజం. అయితే ప్రస్తుతం చాలా మంది చిన్న వయసులోనే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యలకు చెక్ పెట్టడానికి క్రమం తప్పకుండా స్నానం చేసే నీటిలో నిమ్మ రసం వినియోగించడం వల్ల ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు చర్మం బిగుతుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి.
జిడ్డు చర్మానికి చెక్:
ప్రస్తుతం చాలా మంది బయట తిరగడం వల్ల వాతావరణ కాలుష్యంగా కారణంగా చర్మం జిడ్డుగా మారుతోంది. దీని వల్ల వివిధ రకాల చర్మ సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఈ అన్ని సమస్యలకు నిమ్మరసంతో ఉపశమనం కలిగించవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. ఈ జిడ్డును వదిలించుకోవడానికి ప్రతి రోజూ నిమ్మరసంతో తల స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల త్వరలోనే ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
చర్మంపై మరకలు దూరమవుతాయి:
నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ అధిక మోతాదులో ఉంటుంది. కాబట్టి ఇది శరీరం నుంచి మురికిని తొలగించేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా చాలా రోజుల నుంచి ఉన్న మచ్చలు సులభంగా తగ్గుతాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా నిమ్మకాయ నీటితో స్నానం చేయాలని నిపుణులు తెలుపుతున్నారు.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Rashmika School Girl: ఈరోజు నాకు పిచ్చెక్కిపోతుంది.. ఎలా కలవాలో అర్ధం కావడం లేదు: రష్మిక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook