Joint Pain Relief: కీళ్ల, మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు ఎలాంటి ఖర్చు లేకుండా ఇలా చెక్‌ పెట్టొచ్చు!

Knee Joint Pain Relief: ప్రస్తుతం చాలా మందిలో కీళ్ల నొప్పుల సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు అనారోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండడమే కాకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ కింది డ్రింక్‌ను ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 25, 2023, 04:10 PM IST
Joint Pain Relief: కీళ్ల, మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు ఎలాంటి ఖర్చు లేకుండా ఇలా చెక్‌ పెట్టొచ్చు!

 

Knee Joint Pain Relief: భారతదేశ వ్యాప్తంగా కీళ్ల, మోకాళ్ల నొప్పుల సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. చాలా మందిలో ఇలాంటి సమస్యలు చిన్న వయసులోనే వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే నొప్పులు మరింత పెరిగి తీవ్ర వ్యాధులకు కూడా దారి తీసే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. తరచుగా కీళ్ల నొప్పులతో బాధపడేవారు తప్పకుండా ఆధునిక జీవనశైలికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. దీంతో పాటు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

చాలా మందిలో ఈ నొప్పులు క్యాల్షియం లోపం కారణంగా వస్తాయి. అంతేకాకుండా శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ పేరుకుపోవడం వల్ల కూడా రావచ్చు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు మార్కెట్‌లో లభించే చాలా రకాల రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్‌ వినియోగిస్తారు. వీటిని వినియోగించడం వల్ల నీరసం, అలసట వంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి వీటిని వినియోగించడం మానుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఈ రసాయనలతో కూడిన ఔషధాలకు బదులుగా నిపుణులు తెలిపి కొన్ని డ్రింక్స్‌ను ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది. వీటీని తీసుకోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. 

Also Read: IND vs WI Highlights: ఒక్క బంతి పడలేదు.. వరుణుడి ఖాతాలోకి విజయం.. రెండో టెస్టు డ్రా  

ఈ డ్రింక్‌తో శరీరానికి బోలెడు లాభాలు:
సోంపు, ప‌సుపుతో పాటు యాల‌కులు, దాల్చిన చెక్కతో తయారు చేసిన డ్రింక్‌ను ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే పోషకాలు తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అధిక బరువు సమస్యలతో బాధపడుతున్నవారు కూడా ఈ రసాన్ని ప్రతి రోజు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను కూడా సులభంగా కరిగిస్తుంది. ఈ డ్రింక్‌లో అదనంగా బెల్లం తురుమును వినియోగించడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందుతారు. 

శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఈ కీళ్ల నొప్పులతో పాటు గౌట్‌ నొప్పులు వస్తాయి. అంతేకాకుండా ఈ యాసిడ్‌ కారణంగా మరికొంత మందిలో పొట్ట సమస్యలు కూడా వస్తున్నాయి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా యూరిక్‌ యాసిడ్‌ లక్షణాలను గమనించి వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. అంతేకాకుండా పై హోం రెమిడీస్‌ని వినియోగించి ఉపశమనం పొందాల్సి ఉంటుంది.

Also Read: IND vs WI Highlights: ఒక్క బంతి పడలేదు.. వరుణుడి ఖాతాలోకి విజయం.. రెండో టెస్టు డ్రా  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News