Covid19 Cases in India: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడమే కాకుండా దాదాపుగా జీరోకు చేరిందని ఊపిరి పీల్చుకునేలోగా మరోసారి తలుపుతడుతోంది. గత కొద్దిరోజుల్నించి కరోనా వైరస్ కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. గత 24 గంటల్లో వేయికి పైగా కేసులు నమోదవడమే ఇందుకు ఉదాహరణ.
చాలాకాలం తరువాత మరోసారి ఇండియాలో కరోనా మహమ్మారి కోరలు చాచేందుకు సిద్ధమౌతోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశంలో గత 24 గంటల్లో 1134 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజు అంటే మంగళవారంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. మంగళవారం నాడు దేశవ్యాప్తంగా 669 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 7,026కు చేరుకుంది. మొత్తం కేసుల్లో ఇది 0.01 శాతంగా ఉంది. దేశంలోని గుజరాత్, ఢిల్లీ, చత్తీస్‌గడ్, మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కరి చొప్పున 5 మంది కరోనా వైరస్ కారణంగా మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,813కు చేరుకుంది.
గత 24 గంటల్లో కరోనా వైరస్ నుంచి 662 మంది కోలుకోగా మొత్తం కోలుకున్నవారి సంఖ్య 4,41,60,279 మందికి చేరుకుంది. కోవిడ్ రికవరీ శాతం 98.79 శాతంగా ఉంది. మరోవైపు రోజువారీ పాజిటివ్ కేసుల రేటు 1.09 శాతముంది. వీక్లీ పాజిటివ్ రేట్ కూడా 0.98 శాతముంది.
ఇదే సమయంలో అంటే గత 24 గంటల్లో దేశంలో 1,03,831 మందికి కోవిడ్ పరీక్షలు చేయగా, మొత్తం పరీక్షల సంఖ్య 92.05 కోట్లకు చేరుకుంది. కేంద్ర ఆరోగ్యశాఖ వివరాల ప్రకారం కోవిడ్ వ్యాక్సిన్ దేశంలో 220.65 కోట్ల డోసులకు చేరుకుంది. గత 24 గంటల్లో 7,673 డోసుల వ్యాక్సినేషన్ జరిగింది.
Also Read: Control Blood Pressure: అధిక రక్తపోటును చిటికలో తగ్గించే అద్భుతమై నీరు, నమ్మట్లేదా?
Also Read: Rohit Sharma-Virat Kohli: కేవలం 2 రన్స్ మాత్రమే.. ప్రపంచ రికార్డు నెలకొల్పనున్న రోహిత్-కోహ్లీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook