Immune system immunity boosting supplements affect on Body Organs : కోవిడ్-19 వల్ల రోగనిరోధక శక్తిని పెంచే సప్లిమెంట్స్‌ను చాలా మంది ఉపయోగిస్తున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా మంది ఇమ్యూనిటీ పవర్‌ను (Immunity Power) పెంచుకోవడంపై ఎక్కువ ధ్యాస పెడుతున్నారు. ఇమ్యూనిటీ సప్లిమెంట్స్ (immunity supplements) తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అయితే ఈ సప్లిమెంట్లను (supplements) ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా చాలా ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. ఇమ్యునిటీ కోసం వాటిని ఎక్కువగా తీసుకుంటే.. మరో పెద్ద రిస్క్ తప్పదు.
ఇమ్యూనిటీ సప్లిమెంట్లను రోజూ తీసుకుంటూ ఉంటే మాత్రం అవి కచ్చితంగా శరీరంపై దుష్ప్రభావం చూపుతాయి. ముంబై పరేల్‌లోని గ్లోబల్ హాస్పిటల్‌లోని (Global Hospita) సీనియర్ కన్సల్టెంట్, ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ మంజుషా అగర్వాల్.. (Dr Manjusha Agarwal) ఈ విషయంపై స్పష్టతనిచ్చారు.
రోగనిరోధక శక్తిని (Immunity) పెంచేటటువంటి సప్లిమెంట్‌లను ఎక్కువగా తీసుకుంటే కలిగే దుష్ప్రభావాల గురించి వివరించారు. ఇమ్యూనిటీ సప్లిమెంట్స్ అంటువ్యాధులను నివారించడంలో బాగా ఉపయోగపడతాయి... వ్యాధుల బారినపడకుండా ఇవి రక్షణ కల్పిస్తాయనే ఉద్దేశంతో చాలా మంది రోగనిరోధక శక్తిని పెంచే ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. ప్రస్తుతం కోవిడ్ (Covid) విజృంభనతో ఇమ్యూనిటీ సప్లిమెంట్స్ వినియోగం ఎక్కువైంది. అయితే ఇలా ఎక్కువకాలంగా ఇమ్యూనిటీ సప్లిమెంట్స్ వాడడం మంచిది కాదు. అవి ఆరోగ్యంపై (Health) ప్రభావం చూపుతాయి.
అయితే రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు ఇమ్యూనిటీ సప్లిమెంట్స్‌నే వాడాల్సిన అవసరం లేదు. ఇతర మార్గాల్లో కూడా రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. పోషకాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం (Exercise) చేయడం, తగినంత సమయం నిద్రపోవడం వంటి వాటి రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు అని డాక్టర్ మంజుషా అగర్వాల్ తెలిపారు.
ఇమ్యూనిటీ సప్లిమెంట్స్ శరీరంపై (Body) ఎక్కువగా ప్రభావాన్ని చూపుతాయి. అలాగే ఏ మెడిసిన్ తీసుకోవాలనున్నా కూడా సరే.. ముందుగా డాక్టర్‌ని సంప్రందించి, వారి సలహా మేరకే ఉపయోగించాలి. ఇక గర్భిణీలు, బాలింతలు ఇమ్యూనిటీ (immunity) సప్లిమెంట్స్ వాడకపోవడం మంచిది.
Also Read : Hair growth tips: జుట్టు సహజంగా పెరిగే మార్గాలు ఇవిగో..
విటమిన్ ఎ, డి, ఇ, కె వంటి విటమిన్ ట్యాబెట్స్ ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదని డాక్టర్ మంజుషా అగర్వాల్ సూచించారు. వీటిని ఎక్కువగా తీసుకుంటే నరాల సమస్యలు, కండరాల బలహీనత (muscular weakness) ఏర్పడవచ్చవచ్చు. అలాగే కాలేయం దెబ్బతినే అవకాశం ఉంటుంది.
Also Read : Black Raisins Benefits: బ్లాక్ కిస్మిస్‌తో కలిగే ప్రయోజనాలేంటో తెలిస్తే..వదిలిపెట్టరిక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.