Tea: టీ లవర్స్‌కు ఆరోగ్య నిపుణుల హెచ్చరిక.. జాగ్రత్త తీసుకోకపోతే అంతే సంగతి

Side Effects Of Tea: చాయ్ మనందరికీ ఇష్టమైన పానీయం. కానీ దీని ఎక్కువగా తాగడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా కలుగుతాయని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. వాటి గురించి మనం తెలుసుకుందాం

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 24, 2024, 02:39 PM IST
 Tea: టీ లవర్స్‌కు ఆరోగ్య నిపుణుల హెచ్చరిక.. జాగ్రత్త తీసుకోకపోతే అంతే సంగతి

Side Effects Of Tea: మనలో చాలా మంది ఉదయం నిద్రలేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది. మరి కొందరు అన్నం తినాల్సిన సమయంలో కూడా టీ తాగుతారు. అసలు టీ తాగకుండా పచ్చి నీరు కూడా తీసుకోకుండా ఉంటారు. అయితే ఈ విధంగా చేయడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 

టీలో అధిక శాతం కెఫిన్‌ ఉంటుంది. దీని మనం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ దెబ్బతింటుంది. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్‌ పెరిగే ప్రమాదం ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.  టీ ని సాధ్యమైనంత వరకు తక్కువగా తీసుకోవాలని వైద్యలు సూచిస్తున్నారు. 

టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు: 

అతిగా కెఫీన్: 

టీలలో చాలా రకాల కెఫీన్ ఉంటుంది. దీని తీసుకోవడం వల్ల యాక్టివ్ గా ఉంటారు. కానీ ఎక్కువ తీసుకుంటే నిద్రలేమి, ఆందోళన, కంపిస్తుండడం, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. 

గర్భిణీలు, బాలికలు: 

గర్భిణీలు, బాలికలకు కెఫీన్ తక్కువ మోతాదులోనే టీని తీసుకోవాలి. అధికంగా తాగడం వల్ల పుట్టే బిడ్డల బరువు తక్కువగా ఉండే ప్రమాదం ఉంది.

ఎసిడిటీ: 

పాలతో కలిపిన టీ ఎక్కువగా తాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, ఎసిడిటీ పెరుగుతుంది. జీర్ణ సంబంధిత ఇబ్బందులు వస్తాయి. 

నిద్రలేమి:

రాత్రిపూట టీ తాగడం వల్ల నిద్రలేమి వస్తుంది. ముఖ్యంగా గ్రీన్‌ టీలో కెఫీన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి సాయంత్రం 6 గంటల తర్వాత టీ తాగకుండా ఉండటం మంచిది.

ముక్కు కారుతుండడం: 

కొంతమందికి టీ తాగితే ముక్కు కారుతుంది. ఇందులో ఉన్న థియోఫిలైన్ అనే పదార్థం వల్ల ఈ సమస్య వస్తుంది. ఇలాంటి సమస్య ఉంటే తక్కువ కెఫీన్ ఉన్న టీలు తాగడం మంచిది.

టీలను మితంగా తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు బారిన పడాల్సిన అవసరం ఉండదు. టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల పైన చెప్పిన అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుంది. కాబట్టి మీరు మితంగా తీసుకోవడానికి ప్రయత్నించండి. 

Also read: BP Warnings and Signs: రాత్రి వేళ నిద్రించేటప్పుడు బీపీ పెరిగితే ప్రాణాలు పోతాయా, ఏం చేయాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News