Coconut water: ఆరోగ్యకరమైన కొబ్బరినీటిని సైతం తీసుకోవడం పై చాలామందికి సందేహాలు ఉన్నాయి. ప్రకృతి సహజంగా లభించే బెస్ట్ నాచురల్ హైడ్రేటింగ్ డ్రింక్ అయిన కొబ్బరి నీటిలో ఎన్నో పోషక విలువలతో పాటు శరీరానికి తక్షణ శక్తినిచ్చే గుణం కూడా ఉంది. అందుకే కొబ్బరి నీటిని సెలైన్ వాటర్ తో సమానం అంటారు. ఎండ వేడిని తగ్గించడంతో పాటు శరీరంలో ఏర్పడే డిహైడ్రేషన్ కూడా సులభంగా తొలగించడంలో కొబ్బరినీరు సహాయపడుతుంది. మరి అలాంటి కొబ్బరి నీటిని ఎవరు తీసుకోవచ్చు ?ఎవరు తీసుకోకూడదు? తెలుసుకుందామా..
కొబ్బరి నీటిని తాగడానికి ప్రత్యేకమైన సమయం ఉంటుందేమో అని మీలో చాలామందికి డౌట్ కలుగుతుంది. ప్రత్యేకంగా ఇది అంటూ లేదు కానీ.. ఒక క్రమ పద్ధతిలో కొబ్బరి నీరు తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి అని నిపుణులు చెబుతున్నారు.
ప్రతిరోజు పొద్దున కొబ్బరి నీరు తీసుకోవడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు తగ్గడంతో పాటు జీర్ణశక్తి బలపడుతుంది. అందుకే చాలామంది వాకింగ్ కి వెళ్లి వచ్చేటప్పుడు ఓ గ్లాస్ కొబ్బరినీళ్లు కచ్చితంగా తాగుతుంటారు. ఇలా చేసేవారికి మలబద్ధకం లాంటి సమస్యలు ఉండవు.
మరి దాహం వేసినప్పుడు సోడా లేక షుగర్ డ్రింక్స్ తాగే బదులు కొబ్బరి నీళ్లు తీసుకోవడం వల్ల కేలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు నియంత్రణలో ఉంటుంది. కొబ్బరి నీళ్లు ఎక్కువగా సాయంత్రం పూట కంటే కూడా పొద్దున పూట తాగడమే మంచిది.
ఇది శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది కాబట్టి సాయంత్రం వేళలా కొంతమందికి కొబ్బరి నీళ్లు తీసుకోవడం సెట్ కాకపోవచ్చు. అలాగే రక్తంలో పొటాషియం నిలువలు అధిక మోతాదులో ఉన్నవారు కూడా కొబ్బరి నీరు తీసుకోకూడదు. గుండె సమస్య కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడే వారు కొబ్బరి నీరు ఎక్కువగా తాగరాదు.
Also Read: Telangana Election 2023 Result Live: బీజేపీ విజయం సాధించిన స్థానాలు ఇవే.. కీలక నేతలు ఓటమిపాలు
Also read: Telangana Election Results 2023: తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి కారణాలేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook