ICMR Diet Chart: ఈ డైట్ ఫాలో అయితే వ్యాయామం లేకుండానే అధిక బరువుకు చెక్

ICMR Diet Chart: ఇటీవలి కాలంలో అధిక బరువు ప్రధాన సమస్యగా మారిపోయింది. బరువు నియంత్రించడం అనేది ఓ సవాలుగా మారిపోతోంది. వ్యాయామం, డైటింగ్ ఇలా వివిధ రకాలుగా ప్రయత్నించినా విఫలమౌతుంటారు. కొంతమందైతే వ్యాయామం చేయలేని పరిస్థితి ఉంటుంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 21, 2024, 02:50 PM IST
ICMR Diet Chart: ఈ డైట్ ఫాలో అయితే వ్యాయామం లేకుండానే అధిక బరువుకు చెక్

ICMR Diet Chart: అయితే వ్యాయామం లేకుండానే బరువు తగ్గించుకునే మార్గాలున్నాయి. ICMR మహిళలకు ప్రత్యేక డైట్ సిద్ధం చేసింది. ఈ డైట్ ఫాలో అయితే ఎలాంటి వ్యాయామం లేకుండానే బరువు తగ్గించుకోవచ్చు. అంతేకాదు..శరీరంలో ఎలాంటి పోషకాల లోపం లేకుండా ఉంటుంది. బరువు తగ్గించేందుకు ఐసీఎంఆర్ జారీ చేసిన డైట్ ఛార్ట్ ఎలా ఉందో చూద్దాం.

సాధారణంగా మగవారితో పోలిస్తే మహిళల్లో అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటుంటాయి. అటు స్థూలకాయం లేదా అధిక బరువు కూడా మహిళల్లోనే ఎక్కువగా గమనించవచ్చు. మహిళల్లో హార్మోన్ మార్పులు, గర్భం దాల్చడం, మెనోపాజ్ వంటివి ఇందుకు కారణమౌతుంటాయి. వాస్తవానికి సరైన డైట్, వ్యాయామం ద్వారా ఈ సమస్యల్నించి విముక్తి పొందవచ్చు కానీ మహిళలు అంత సునాయసంగా వ్యాయామం చేయలేరు. అందుకే ఐసీఎంఆర్ మహిళలక కోసం ప్రత్యేకంగా డైట్ ఛార్జ్ సిద్ధం చేసింది. వ్యాయామం చేయలేని మహిళలకు ఈ డైట్ ఛార్ట్ ఉపయోగపడుతుంది. ఈ ప్రత్యేక డైట్ ద్వారా శరీరంలో అన్ని రకాల పోషకాలు అందడమే కాకుండా బరువు క్రమంగా తగ్గగలరు. హెల్తీ ఫుడ్ ఎంత అవసరమనేది ఈ ఛార్ట్ ద్వారా తెలుస్తుంది. 

మనిషి ఆరోగ్యంగా ఉండటం అనేది మనం వినియోగించే ఆయిల్‌ను బట్టి కూడా ఉంటుంది. వేరుశెనగ నూనె, గానుగ నూనె, కనోలా నూనె, జైతూన్ ఆయిల్ వంటివి వినియోగిస్తే మంచి ఫలితాలుంటాయి. రోజూ తినే ఆహారంలో ఐదు రకాల పండ్లు, కూరగాయలు ఉండేట్టు చూసుకోవాలి. అంతేకాకుండా తృణధాన్యాలు, ఫైబర్, కార్బొహైడ్రేట్లు, పోషకాలతో నిండి ఉంటాయి. తినే ఆహారంలో జొన్నలు, బ్రౌన్ రైస్, బాజ్రా, ఓట్స్ వంటివి కలపాలి.

పప్పులు కచ్చితంగా డైట్‌లో ఉండాలి. తద్వారా శరీరానికి కావల్సిన ప్రోటీన్లు, ఫైబర్ , ఇతర పోషకాలు అందుతాయి. వారంలో కనీసం మూడు సార్లు తినే ఆహారంలో పప్పులు ఉండాలి. పాలు, పాల ఉత్పత్తుల వల్ల శరీరానికి కావల్సిన కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా లభిస్తాయి. ఎముకలకు బలాన్నిస్తాయి. అందుకే పాలు, పెరుగు అనేవి డైట్‌లో ఉండాలి. 

ఐసీఎంఆర్ డైట్ ఛార్ట్

బ్రేక్ ఫాస్ట్ 470 కిలోకేలరీలుండాలి. దీనికోసం నానబెట్టిన తృణధాన్యాలు 60 గ్రాములు, ఉడకబెట్టిన లోబియా లేదా శెనగలు 30 గ్రాములు, ఆకు కూరలు 50 గ్రాములు, నట్స్ 20 గ్రాములు తీసుకోవాలి. 

లంచ్ 740 కిలోకేలరీలుండాలి. ధాన్యం లేదా రైస్ 80 గ్రాములు, పప్పులు 20 గ్రాములు, కూరగాయలు 150 గ్రాములు, ఆకుకూరలు 50 గ్రాములు, నట్స్ 10 గ్రాములు, పెరుగు 150 మిల్లీలీటర్లు, పన్నీర్ లేదా పండ్లు 50 గ్రాములుండాలి

డిన్నర్ 415 కిలోకేలరీలుండాలి. రైస్ లేదా గోధుమలు 60 గ్రాములు, పప్పులు 15 గ్రాములు, కూరగాయలు 50 గ్రాములు, ఆయిల్ 5 గ్రాములు, పెరుగు 100 మిల్లీలీటర్లు, పండ్లు 50 గ్రాములుండాలి. ఈవెనింగ్ స్నాక్ 35 కిలోకేలరీలు మాత్రమే ఉండాలి. పాలు 50 మిల్లీలీటర్లు తప్పకుండా తీసుకోవాలి. ఈ డైట్ ఛార్జ్ క్రమం తప్పకుండా ఫాలో అవడమే కాకుండా రోజూ తగినంత నీళ్లు తప్పకుండా తాగాలి. ఉప్పు, పంచదార తగ్గించాలి. ప్యాకేజ్డ్, ప్రాసెస్డ్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. రోజూ రాత్రి వేళ తగినంత నిద్ర తప్పకుండా ఉండాలి. 

Also read: Infinix Hot 40i: 16జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్, 50MP కెమేరాతో సూపర్‌ఫోన్ కేవలం 9 వేలకే

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News