Breakfast: బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారా ? అయితే ఇది చదవండి

Good Start is a Half Done: అంటే ఆరంభం అదిరిపోతే.. మిగితాదంతా బాగుంటుంది అని. అందుకే  ప్రతీరోజును మంచి ఆల్పాహారం ( Breakfast ) తో ప్రారంభించాలి. ఎట్టిపరిస్థితిలో మిస్ చేసుకోకూడదు.. ఎందుకంటే…

Last Updated : Oct 21, 2020, 11:12 PM IST
    • టెన్షన్ లైఫ్ లో బ్రేక్ ఫాస్ట్ మిస్ అవుతున్నారా ?
    • లంచ్ టైమ్ లో ఆల్పాహారం చేస్తున్నారా ?
    • అయితే దానివల్ల ఎంత నష్టమో చదవండి
Breakfast: బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారా ? అయితే ఇది చదవండి

Effects of Skipping Breakfast | బ్రేక్ ఫాస్ట్ ( Breakfast ) ప్రాధాన్యత తెలియక చాలా మంది స్కిప్ చేస్తుంటారు. ఆఫీస్  కు లేట్ అయింది అని,  డైరక్ట్ గా లంచ్ ( Lunch ) చేద్దామని కొంత మంది ఉదయం ఆల్పాహారాన్ని మిస్ చేస్తుంటారు. ఇలా  చేయవద్దంటున్నారు నిపుణులు. ఉదయం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ మనకు రోజంతా ఉత్సాహంతో ( Active Day )  ముందుకు వెళ్లేలా చేస్తుందని వారంటున్నారు. 

ALSO READ | Potato Juice : కేన్సర్ సమస్యను దూరం చేసే బంగాళదుంప రసం.. 

రాత్రి భోజనం పూర్తి చేసిన తరువాత ఉదయం నిద్ర లేచేవరకు దాదాపు 12 గంటలు గ్యాప్ ఉంటుంది. ఇలాంటి సమయంలో మన శరీరానికి తగిన పోషకాలు ( Nutrients  ) అవసరం. శరీరం, మనసు యాక్టీవ్ గా ఉండాలి అంటే కేలరీలు ( Calaries )  అవసరం అవుతాయి. శరీరానికి పిండిపదార్థాలు ( Starchy Substance )  కూడా అవసరం. ఆల్పాహారం వీటిని భర్తీ చేస్తుంది. 

ALSO READ|  Immunity Booster Tea: ఇమ్యూనిటీని పెంచే అల్లం పసుపు ఛాయ్

పీచుపదార్ధాలు ( Fiber ), పిండిపదార్థాలు ( Starch ), మాంసక్రుతులు (Protein) , ఇతర న్యూట్రియంట్స్ ఉండేలా బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. సరిగ్గా ఆల్పాహారం తీసుకోని వాళ్లు నీరసానికి గురి అయి త్వరగా చిరాకుగా పడే అవకాశం ఉంది. అందుకే తప్పనిసరిగా ఆల్పాహారం చేయాలని పోషకాహార నిపుణులు ( Nutritionist )  చెబుతుంటారు.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News