Hot Water Bath Effects: వేడి నీటితో స్నానం చేస్తున్నారా.. మీరు ప్రమాదంను కొని తెచుకున్నట్టే!

Hot Water Bath Causes, Hot Water Bath will cause several health problems. గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే పర్వాలేదు కానీ.. బాగా వేడి నీటితో స్నానం చేస్తే మాత్రం ప్రమాదమే అని స్కిన్ స్పెషలిస్ట్ అంటున్నారు.  

Written by - P Sampath Kumar | Last Updated : Dec 12, 2022, 03:10 PM IST
  • వేడి నీటితో స్నానం చేస్తున్నారా
  • మీరు ప్రమాదంను కొని తెచుకున్నట్టే
  • సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం
Hot Water Bath Effects: వేడి నీటితో స్నానం చేస్తున్నారా.. మీరు ప్రమాదంను కొని తెచుకున్నట్టే!

Hot Water Bath Causes: ప్రస్తుతం శీతాకాలం (వింటర్ సీజన్) నడుస్తోంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి తీవ్రతకు ఉదయం, రాత్రి వేళలలో ఇళ్లు, ఆఫీస్ వదిలి బయటికి రావాలంటేనే జనాలు భయపడిపోతున్నారు. ఈ చలి కాలంలో నీటిలో చేతులు పెట్టడం కూడా కష్టంగానే ఉంటుంది. తీవ్ర చలి నేపథ్యంలో అందరూ వేడి నీటిని ఉపయోగిస్తున్నారు. వేడి నీళ్లతో స్నానం చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందుతున్నారు. అయితే గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే పర్వాలేదు కానీ.. బాగా వేడి నీటితో స్నానం చేస్తే మాత్రం ప్రమాదమే అని అమెరికాకు చెందిన ఓ స్కిన్ స్పెషలిస్ట్ అంటున్నారు.

శీతాకాలంలో చాలా మంది టబ్‌లో లేదా వేడి షవర్ కింద సుదీర్ఘ సమయం ఉండడం మంచిది కాదంటున్నారు అమెరికా స్కిన్ స్పెషలిస్ట్. బాగా వేడి నీళ్లతో స్నానం చేస్తే చర్మంలోని తేమ శాతం తగ్గి చర్మం పొడిబారిపోతుందట. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే సహజ నూనెలు, కొవ్వులు మరియు ప్రోటీన్‌లను వేడి నీరు నాశనం చేస్తుందట. పొడి చర్మంతో ఇన్ఫెక్షన్ అవకాశాలు పెరుగుతాయి. మంచి బ్యాక్టీరియా నశించడం కారణంగా చర్మంపై పగుళ్లు, దురద సమస్యలు వంటివి ఎదురవుతాయని ఆయన అంటున్నారు. జుట్టు పెరుగుదల కూడా తగ్గిపోతుందట.

తరచుగా వేడి స్నానాలు చేస్తే చర్మంపై ముడతలు, దురద లేదా దద్దుర్లు కూడా వస్తాయట. దాంతో యవ్వనంలోనే ముసలివారిలా కనిపిస్తారు. మొటిమలు ఉన్నవాళ్లు వేడి నీళ్లతో స్నానం చేస్తే..  మరింత పెరిగే అవకాశం ఉంది. నీళ్లు మరీ వేడిగా ఉంటే తలపై రక్త ప్రసరణ వేగం తగ్గుతుంది. దీనివల్ల జుట్టు పెరగుదల మందగించి.. హెయిర్ ఫాల్ మొదలవుతుంది. వేడి నీళ్ల కారణంగా హైపర్ టెన్షన్‌కు కూడా కారణం అవుతుంది. వేడి నీళ్లతో స్నానం చేస్తే వెంటనే నిద్రపోవాలనే భావన కలుగుతుంది. ఇది మిమ్మల్ని నీరసంగా మార్చేస్తుంది. ఇక తరచూ వేడి నీళ్లతో స్నానం చేస్తే సంతానోత్పత్తి సామర్థ్యంపై కూడా ప్రభావం చూపుతుందని చెప్పారు. 

అన్ని సమస్యలకు చెక్ పెట్టాలంటే.. వారానికి కొన్ని సార్లు చల్లని నీటితో మరికొన్ని సార్లు గోరువెచ్చని నీతితో స్నానం చేయడం ఉత్తమం అని అమెరికా స్కిన్ స్పెషలిస్ట్ చెపుతున్నారు. మరీ వేడి నేటితో స్నానం చేయొద్దని ఆయన సూచిస్తున్నారు. టబ్‌లో తక్కువ సమయం ఉండడం కూడా మీ చర్మానికి ప్రయోజనం అని పేర్కొన్నారు. సబ్బు వాడకం కూడా తగ్గితే మంచిదట. సువాసన లేని లోషన్, క్రీమ్ లేదా నూనెను అప్పుడప్పుడూ చర్మానికి రుద్దుకోవాలని చెప్పారు. 

Also Read: Best Mileage Bikes: తక్కువ ధరలో.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ బైక్స్ ఇవే! దేశాన్ని కూడా చుట్టేయొచ్చు  

Also Read: Vijay Devarakonda Father : విజయ్ దేవరకొండను మళ్లీ గెలికిన బండ్ల గణేష్.. నెటిజన్ల కామెంట్లు వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News