High Cholesterol: ఈ చెడు కొలెస్ట్రాల్ శత్రువు కంటే ప్రమాదం.. ఈ 4 వ్యాధులను ఎంకరేజ్ చేస్తుంది! కొన్నిసార్లు మరణం తప్పదు

High Cholesterol Risk Factors, Sometimes death is inevitable with High Cholesterol. చెడు కొలెస్ట్రాల్.. మీ శత్రువు కంటే ప్రమాద కరమైంది. ఎంతో ప్రమాదకరమైన అనేక వ్యాధులకు కారణం అవుతుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Jan 2, 2023, 02:04 PM IST
  • ఈ చెడు కొలెస్ట్రాల్ శత్రువు కంటే ప్రమాదం
  • ఈ 4 వ్యాధులను ఎంకరేజ్ చేస్తుంది
  • కొన్నిసార్లు మరణం తప్పదు
High Cholesterol: ఈ చెడు కొలెస్ట్రాల్ శత్రువు కంటే ప్రమాదం.. ఈ 4 వ్యాధులను ఎంకరేజ్ చేస్తుంది! కొన్నిసార్లు మరణం తప్పదు

High Cholesterol Risk Factors: సిరల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్.. మీ శత్రువు కంటే ప్రమాద కరమైంది. ఈ చెడు కొలెస్ట్రాల్ ఎంతో ప్రమాదకరమైన అనేక వ్యాధులకు కారణం అవుతుంది. తక్కువ సాంద్రత కలిగిన చెడు కొలెస్ట్రాల్‌ను లిపోప్రొటీన్ (ఎల్‌డీఎల్) అని కూడా అంటారు. ఈ జిగట పదార్ధం మన ధమనులలో పెద్ద పరిమాణంలో పేరుకుపోతే.. అది రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ ఎల్‌డీఎల్ వల్ల మనిషికి పెను ప్రమాదం అని చెప్పాలి. దీని వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Artery Disease:
మన సిరల్లో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం ప్రారంభించినప్పుడు ధమనులు సరిగా పనిచేయవు. ఈ ప్రక్రియను అథెరోస్క్లెరోసిస్ అంటారు. దీని కారణంగా రక్తం మరియు ఆక్సిజన్ గుండెకు చేరవు. దాంతో మనిషి తీవ్రమైన పరిణామాలకు గుర్వక తప్పదు. 

Heart Attack:
రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. కొన్నిసార్లు దీని వల్ల ప్రాణం కూడా పోతుంది. సిరల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు.. రక్తం గుండెకు చేరుకోవడానికి చాలా శక్తి కావాల్సి ఉంటుంది. దాని కారణంగా గుండెపోటు వస్తుంది.

Stroke:
చెడు కొలెస్ట్రాల్ వల్ల స్ట్రోక్ కూడా వస్తుంది. వాస్తవానికి ఎల్‌డీఎల్ గుండె యొక్క సిరలను నిరోధించడమే కాకుండా.. మెదడుకు వెళ్లే ధమనులలో అడ్డంకిని కలిగిస్తుంది. దాంతో స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. దీనిని 'బ్రెయిన్ స్ట్రోక్' అని కూడా అంటారు. ఇటీవల ఈ వ్యాధి కారణంగా చాలా మంది మరణిస్తున్నారు.

Erectile Dysfunction:
చెడు కొలెస్ట్రాల్ పురుషుల సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది. అనేక పరిశోధనలు ప్రకారం.. అంగస్తంభన మరియు చెడు కొలెస్ట్రాల్ మధ్య సంబందం ఉంటుందట. చెడు కొలెస్ట్రాల్ కారణంగా పురుషులు తండ్రులు కావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు.

Also Read: ప్రభుత్వ ఉద్యోగులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. 4 శాతం డీఏ పెంపు! జనవరి నుంచే పెరిగిన జీతం

Also Read: Purse Vastu Tips: కొత్త ఏడాదిలో ఈ వస్తువులు పర్స్‌లో పెట్టుకుంటే.. ఏడాది పొడవునా డబ్బేడబ్బు!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

 

Trending News