Winter Tips: చలికాలంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ తప్పుగా చూపించడానికి కారణాలు ఇవేనా..ఈ క్రమంలో ఏం చేయాలి?

Winter Tips: చలికాలంలో సాధారణంగా వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడంతో..నీరసం, అలసట వంటివి వెండాడుతుంటాయి. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ నియంత్రణలో ఉండాలంటే..జీవనశైలి, ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 6, 2023, 10:44 AM IST
Winter Tips: చలికాలంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ తప్పుగా చూపించడానికి కారణాలు ఇవేనా..ఈ క్రమంలో ఏం చేయాలి?

చలికాలంలో మధుమేహం వ్యాధిగ్రస్థులు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ మారుతుంటాయి. శరీర ఉష్ణోగ్రతను బట్టి ఇన్సులిన్ వినియోగం మారుతుంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ వివరాలు మీ కోసం..

తీవ్రమైన చలి గ్లూకోజ్ లెవెల్స్‌ను ప్రభావితం చేయడమే కాకుండా..తప్పుడు రీడింగ్‌కు కారణమౌతుందంటున్నారు వైద్య నిపుణులు. డయాబెటిస్ మేనేజ్‌మెంట్ అనేది జీవనశైలి మార్పులపై ఆధారపడి ఉంటుంది. చలికాలంలో సహజంగానే బద్ధకంగా, అలసట, నీరసంగా ఉంటుంది. దీనికి కారణం బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడమే. అందుకే చలికాలంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ నింత్రణలో ఉంచేందుకు కొన్ని సూచనలు కూడా ఇస్తున్నారు.

శరీరం వెచ్చగా ఉండాలి

వ్యాయామం వంటి ఫిజికల్ ఎక్సర్‌సైజ్ ద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించవచ్చు. ఈ ప్రక్రియ శరీరంలోని ఇన్సులిన్ వినియోగాన్ని సరిచేస్తుంది. మిమ్మల్ని వెచ్చగా ఉంచుతుంది. మీ మూడ్ సరిచేస్తుంది. బయట చలి ఎక్కువగా ఉంటే..ఇండోర్ ఎక్సర్‌సైజ్‌లు చేయాల్సి ఉంటుంది. 

ఆరోగ్యంపై శ్రద్ధ

ఆరోగ్యం బాగా లేనప్పుడు ఉన్నప్పుడు డయాబెటిస్ నియంత్రించడం కష్టం. చలి, వైరస్, ఫ్లూ వంటివి సోకినప్పుడు ఇవి కీటోన్స్ వృద్ధి చేస్తాయి. ఈ పరిస్థితుల్లో వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. 

చలికాలంలో మధుమేహ వ్యాధిగ్రస్థులు ఆరోగ్యంగా ఎలా ఉండాలి

ఫ్లూ షాట్ తప్పకుండా తీసుకోవాలి. రాత్రి కచ్చితంగా 7-8 గంటల నిద్ర ఉండాలి. మీ చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ ఆరోగ్యం బాగా లేకపోతే ఇంట్లో విశ్రాంతి తీసుకోండి. ఆరోగ్యమైన ఆహారం తీసుకోవాలి. బయటకు పార్టీలకు వెళ్లినప్పుడు చలి నుంచి కాపాడే దుస్తులు తప్పకుండా ధరించాలి. ఆల్కహాల్ సేవించాల్సి వస్తే..సరైన ఆహారంతో తీసుకోండి. తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ఎంత పరిమాణంలో ఉన్నాయో చూసుకోండి. చలికాలంలో ఎక్కువ నీళ్లు తాగడం ద్వారా హైడ్రేట్‌గా ఉండండి. మందులు వాడటం మర్చిపోవద్దు. స్ప్రౌట్స్ , కూరగాయలు అధికంగా తీసుకోవాలి. 

Also read: Green Tomato Benefits: ఎర్ర టొమాటోలు కాదు..గ్రీన్ టొమాటో వాడి చూడండి, అద్భుతమైన లాభాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News