Hibiscus Flower Face Mask: మందార పువ్వు జుట్టుకు మాత్రమే కాదు చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది..!!

Hibiscus Flower Face Mask: ప్రస్తుతం చాలా మంది ఇళ్లలో మందారం మొక్కలను పెంచుకుంటున్నారు. దీనిని పూజలలో ఉపయోగించడమే కాకుండా పలు రకాల చర్మ సమస్యలకు కూడా ఉపయోగించవచ్చని ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 24, 2022, 01:37 PM IST
  • మందార పువ్వుతో చర్మానికి ఎన్నో ప్రయోజనాలు
  • చర్మానికే కాకుండా జుట్టుకు కూడా చాలా ఉపయోగాలు
  • మందార పువ్వు, పెరుగుతో ఫేస్ ప్యాక్‌తో చర్మాపై మొటిమలు మటుమాయం
Hibiscus Flower Face Mask: మందార పువ్వు జుట్టుకు మాత్రమే కాదు చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది..!!

Hibiscus Flower Face Mask: ప్రస్తుతం చాలా మంది ఇళ్లలో మందారం మొక్కలను పెంచుకుంటున్నారు. దీనిని పూజలలో ఉపయోగించడమే కాకుండా పలు రకాల చర్మ సమస్యలకు కూడా ఉపయోగించవచ్చని ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొన్నారు.  ప్రస్తుతం చర్మ సంరక్షణలో మందార పువ్వుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా మంది తెలియదు..!!. మందారం జుట్టు రాలడాన్ని ఆపడానికి దివ్యౌషధంగా పని చేస్తుంది. అంతే కాకుండా చర్మానికి కావాల్సిన అన్ని ప్రయోజనాలను చేకూర్చుతుంది. మందారం వల్ల చర్మానికి కలిగే ఇతర ప్రయోజనాలను తెలుసుకుందాం..

మందార పువ్వు చర్మానికి చాలా మేలు చేస్తుంది:

చాలా మందికి మందారలో ఉన్న ఔషధ మూలకాలతో కూడిన లక్షణాల గురించి తెలియదు.! మందారంలో ఉండే గుణాలు జుట్టు ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాకుండా వేసవిలో చర్మానికి ఎన్నో లభాలను చేకూర్చుతాయి.

మందార పువ్వు, పెరుగుతో ఫేస్ ప్యాక్:

వేసవిలో మెరిసే చర్మం పొందడానికి మందార పువ్వులను ఎండబెట్టి పొడి చేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో 1 టీస్పూన్ పెరుగు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. దీంతో చర్మానికి ఎన్నోలాభాలు చేకూరుతాయి.

మందార పువ్వు, లావెండర్‌తో ఫేస్ ప్యాక్:

యాంటీ బాక్టీరియల్, యాంటీ సెప్టిక్ లక్షణాలను కలిగి ఉన్న ఈ రెసిపీ ముఖంపై మొటిమలను తొలగిపోవడానికి సహాయపడుతుంది. దీన్ని తయారు చేయడానికి.. ముందుగా 1 టీస్పూన్ మందార పూల పొడి, 2 టీస్పూన్ల పెరుగు, 2 నుంచి 3 చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయండి. తర్వాత 15-20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రపరుచుకోవాలి.

మందార పువ్వు, తేనెతో ఫేస్ మాస్క్:

ఈ ఫేస్ మాస్క్‌ను చేయడానికి..ముందుగా 1 టీస్పూన్ మందార పూల పొడిని తీసుకొని..దానిలో 1 టీస్పూన్ తేనె కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఈ ఫేస్ మాస్క్ ముఖంలోని డెడ్ స్కిన్ సెల్స్ ను రిపేర్ చేయడాని సహాయపడుతుంది.

మందార పువ్వు, కలబందతో ఫేస్ ప్యాక్:

ఔషధ మూలకాలతో కూడిన ఈ ఫేస్ ప్యాక్ చర్మంపై ముడతలు, గీతలు, మచ్చలను తొలగించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ కోసం..1 టీస్పూన్ మందార పువ్వులతో తయారు చేసిన పొడిని తీసుకొని.. అందులో 1 టీస్పూన్ అలోవెరా జెల్ వేసి పేస్ట్ చేయండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను కాటన్ గుడ్డతో ముఖానికి పట్టించి.. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి.

మందార పువ్వు, ముల్తానీ మట్టితో ఫేస్ ప్యాక్:

వేసవిలో జిడ్డు చర్మాన్ని వదిలించుకోవడానికి మందార పువ్వు, ముల్తానీ మట్టితో చేసిన ఫేస్ ప్యాక్ ఎంతో ఉపయోగపడుతుంది. దీనిని తయారు చేసుకోవడానికి.. ముందుగా 1 టీస్పూన్ మందార పూల పొడిని తిసుకోండి. అందులో 1 టీస్పూన్ ముల్తానీ మట్టి, రోజ్ వాటర్ కలిపి పేస్ట్ చేయండి. ఇప్పుడు దీన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకోండి.

Also Read: Skin Care Tips: పుట్టుమచ్చలు, మొటిమల నుంచి ఈ చిట్కా ద్వారా సులభంగా విముక్తి పొందండి..!!

Also Read: Curd Benefits: ఇంటీ నుంచి బయటకు వెళ్లే సమయంలో చక్కెర కలిపిన పెరుగును తినండి..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News