Heart Attack Risk: గుండె సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా వీటిని తినాలి.. ఎందుకో తెలుసా..!

Heart Attack Risk: మనం తినే రోజూ పచ్చి కూరగాయలలో ఫైబర్, పోషకాలు పరిమాణం అధికంగా ఉంటాయి. అయితే వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి అధికంగా పోషకాలు లభిస్తాయి. అయితే చాలా మంది వీటిని అధికంగా తినడం వల్ల గుండె పోటు సమస్యలు తగ్గుతాయని అనుకుంటారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 11, 2022, 01:02 PM IST
  • గుండె సమస్యల ఉన్నవారు తప్పకుండా వీటిని తినాలి..
  • బంగాళాదుంప, సోయాబీన్, టొమాటో తినాలి
  • గుండె జబ్బులను నియంత్రిస్తుంది
Heart Attack Risk: గుండె సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా వీటిని తినాలి.. ఎందుకో తెలుసా..!

Heart Attack Risk: మనం తినే రోజూ పచ్చి కూరగాయలలో ఫైబర్, పోషకాలు పరిమాణం అధికంగా ఉంటాయి. అయితే వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి అధికంగా పోషకాలు లభిస్తాయి. అయితే చాలా మంది వీటిని అధికంగా తినడం వల్ల గుండె పోటు సమస్యలు తగ్గుతాయని అనుకుంటారు. అవును నిజమే వీటిని క్రమం తప్పకుండా ఆహారంగా తీసుకుంటే శరీరానికి అందాల్సి పోషకాలు అంది.. గుండె సమస్యలు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా స్ట్రోక్ వచ్చే ప్రమాదం తగ్గదని నిపుణులు చెబుతున్నారు. కావున గుండె వ్యాధుల నుంచి ఉపశమనం పొందడానికి పచ్చి కూరగాయలను తగినంతగా తీసుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ కూరగాయలు తప్పకుండా తినాలి:

బంగాళాదుంప, సోయాబీన్, టొమాటో, ఉల్లిపాయలు, బ్రోకలీ కూరగాయలు గుండెపోటును నివారించడానికి చాలా సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో విటమిన్లు, అవసరమైన అంశాలు, ఫైబర్ ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన ప్రయోజనాలను అందిస్తాయి.

చేపలు:

చేపలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరాన్ని దృఢంగా చేసేందుకు కృషి చేస్తాయి. అంతేకాకుండా  ఇవి గుండెను రక్షించడంతోపాటు ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు ఆమ్లల కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రింస్తుంది.

వెజ్ తినేవారు మష్రూమ్ తినాలి:
 
మష్రూమ్‌లో విటమిన్ సి, డి, ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. విటమిన్ సి యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించి.. గుండె జబ్బులను దూరంగా చేస్తుంది. చేపల్లో విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. కావున వెజ్ మాత్రమే తినే వారు పుట్టగొడుగులను తినాలి. అంతేకాకుండాపచ్చి కూరగాయలు, బొప్పాయి, బచ్చలికూర, క్యాప్సికంలో కూడా విటమిన్-సి పుష్కలంగా లభిస్తుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Read also: Paratha Recipe: ఉదయాన్నే దీనితో చేసిన పరాటా తింటే.. రోజంతా శరీరం అక్టివే..!

Read also: Heavy Rains: కుండపోత వానలతో తెలంగాణ అతలాకుతలం.. గోదావరిలో ప్రమాదకరంగా నీటిమట్టం

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

 

Trending News