Green Apple For Weight Loss: యాపిల్‌లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. క్రమం తప్పకుండా యాపిల్స్ తింటే అనారోగ్య సమస్యలు సులభంగా దూరమవుతాయి. అయితే చాలా మంది రెడ్ యాపిల్స్ విచ్చల విడిగా తీసుకుంటూ ఉంటారు. అయితే రెడ్ యాపిల్స్‌కి బదులుగా గ్రీన్ యాపిల్స్ తీసుకుంటే శరీరానికి రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు తెలుపుతున్నారు. గ్రీన్ యాపిల్‌లో కాల్షియం, ఐరన్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది.
వీటికి చాలా రకాలుగా మేలు చేస్తాయి:
ఎముకలు దృఢంగా మారుతాయి:
గ్రీన్ యాపిల్స్‌లో క్యాల్షియం అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరానికి కావాల్సిన చాలా రకాల ప్రయోజనాలు కలగడమేకాకుండా ఎముకలు శక్తి వంతంగా తయారవుతాయి. ముఖ్యంగా ఎముకల సమస్యలతో బాధపడేవారి ప్రభావవంతంగా పని చేస్తుంది.
బరువు తగ్గుతారు:
బరువు తగ్గాలనుకునేవారికి ఈ గ్రీన్ యాపిల్ ప్రభావవంతంగా సహాయపడతాయి. ఇందులో ఖనిజాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల జీర్ణక్రియ శక్తి వంతంగా మారుతుంది. అంతేకాకుండా సులభంగా బరువు తగ్గుతారు.
కాలేయ సమస్యలకు చెక్:
గ్రీన్ యాపిల్స్‌లో ఉండే పోషకాలు కాలేయాన్ని బలోపేతం చేయడానికి కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ అన్ని రకాల వ్యాధులను నియంత్రించడానికి సహాయపడుతుంది.
జీర్ణక్రియ:
ప్రస్తుతం చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అయితే ముఖ్యంగా చాలా మంది జీర్ణక్రియ సంబంధించి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ప్రతి రోజూ గ్రీన్ యాపిల్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
కంటి చూపును పెంచుతుంది:
యాపిల్‌లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తింటే కళ్లకు చాలా రకాల మేలు చేస్తుంది. ఆపిల్స్ ఉండే పోషకాలు కంటి చూపును పెంచడానికి ప్రభావవంతంగా సహాయపడుతుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించదు.)
Also read: Jobs in Indian Army: ఇండియన్ ఆర్మీ నుంచి జాబ్ నోటిఫికేషన్.. వీరు కూడా అప్లై చేసుకోవచ్చు..
Also read: Jobs in Indian Army: ఇండియన్ ఆర్మీ నుంచి జాబ్ నోటిఫికేషన్.. వీరు కూడా అప్లై చేసుకోవచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook