Foods that reduce heart attack risk: మన ఆరోగ్యపు అలవాట్లు మన హృదయాన్ని, దాని ఆరోగ్యాన్ని ప్రభావితం చేయగలవు అనేది అందరికీ తెలిసిందే. అయితే ఆహారం, మాత్రమే కాక, నిద్ర అలవాట్లు, శారీరక శ్రమ, పొగ త్రాగడం వంటివి కూడా మన గుండె ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయి. కాబట్టి మన ఆరోగ్యానికి ఏం కావాలి అనే విషయాలు మనం తప్పకుండా తెలుసుకోవాలి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం, ప్రతి ముగ్గురిలో ఒకరికి గుండె వ్యాధి ఉంటుంది. అందులోనూ 103 మిలియన్ల అమెరికన్లు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. దాని వల్ల హార్ట్ అటాక్ లేదా స్ట్రోక్ వచ్చే ముప్పు కూడా ఎక్కువే. గుండె వ్యాధిని నివారించడంలో మనకి సహాయపడటానికి మనమే మన జీవన శైలి మార్చుకోవాలి. అందులో మనం ముఖ్యంగా తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఒకసారి చూద్దాం.
పండ్లు - కూరగాయలు:
ప్రతి రోజూ పండ్లు కూరగాయలను ఎక్కువగా తినాలి. రోజూ ఫ్రెష్ లేదా ఫ్రోజెన్ బ్లూబెర్రీలు తినడం చాలా అవసరం. పాలకూరను కూడా మన డైట్ లో చేర్చుకోవాలి. పాలకూరతో పప్పు లేదా కూర నచ్చని వారు సలాడ్‌గా అయినా తినాలి. వెల్లుల్లి, ఉల్లిపాయలతో ఎక్కువగా వేయించవద్దు. పండ్లు, కూరగాయలు అధికంగా ఉన్న ఆహారం గుండె వ్యాధి ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. ఎండిన, తాజా లేదా గడ్డకట్టిన వి అయినా తక్కువ సోడియం ఉన్న పండ్లు మరియు కూరగాయలు తీసుకోవాలి.
ధాన్యాలతో తయారైన ఆహారాలను ఎంచుకోండి:
ధాన్యాలలో ఎక్కువగా ఉపయోగకరమైనవి క్విక్ ఓట్స్ లేదా క్వినోవా. ఇవి రెండు సంపూర్ణ ధాన్యాలు. వీటిని వండడం కూడా చాలా సులువు. వైట్ ఫ్లోర్ కి ఎంత దూరంగా ఉంటే ఆ త మంచిది. అందులో పోషకాలు తక్కువగా ఉంటాయి.. ఫైబర్ కూడా ఎక్కువగా లభించదు.
ఆరోగ్యకరమైన ప్రోటీన్ వనరులను తీసుకోవాలి:
ప్రతిరోజూ ఉదయం డ్రై ఫ్రూట్స్ తినాలి. వాల్నట్స్, బాదం పప్పలలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక కప్పు నిండా డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ఒక మంచి స్నాక్ లాగా కూడా ఉపయోగపడతాయి. ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ తినడం గుండె వ్యాధి, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
మినుములు కూడా ఎక్కువ ఫైబర్, అధిక ప్రోటీన్ కలిగి ఉంటాయి. పైగా వండడానికి సులభంగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ కంటే మినుముల వల్ల జీర్ణాశయ అసౌకర్యాలు కూడా ఎక్కువగా రావు. పెసరలు అధికంగా తీసుకోవడం వల్ల కూడా గుండె వ్యాధి ప్రమాదాన్ని తగ్గే అవకాశం ఉంది.
తక్కువ కొవ్వు లేదా కొవ్వు లేని పాల ఉత్పత్తులు:
నాన్-ఫ్యాట్ గ్రీక్ యోగర్ట్ ను అనేక విధాలుగా ఉపయోగించవచ్చు. ఇది ప్రోటీన్‌లో అధికంగా ఉంటుంది.. చాలా క్యాల్షియం కలిగి ఉంటుంది.
ఉప్పు వాడకం బాగా తగ్గించాలి:
మనం తినే ఎలాంటి ఆహారం అయినా సహజ రుచిని పెంచడానికి ఉప్పు బదులుగా మిరియాలు లేదా సిట్రస్ ఉపయోగించాలి.
రుచికరమైన ఆహారం తినడం.. కేలరీలను తగ్గించడం మాత్రమే కాక.. సరైన, తాజా, ఆహారాలను తినడం వల్ల మాత్రమే మన శరీరానికి కావాల్సిన విటమిన్లుz ఖనిజాలను అందుతాయి అని ఎప్పుడూ మరచిపోకూడదు.
Also Read: Harish Rao: వరద బాధితుల కన్నీళ్లు తుడిచిన హరీశ్ రావు.. రేవంత్ ప్రభుత్వంపై శాపనార్థాలు
Also Read: Telangana Floods: విరాళంపై రగడ.. వైజయంతి మూవీస్‌కు తెలంగాణ విద్యార్థుల వార్నింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter