Weight Loss Tips: యుక్త వయసులో ఉన్న అబ్బాయిలు శారీరకంగా మరియు మానసికంగా నిరంతరంగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా చదువు కోసం ఇంట్లో తల్లి దండ్రుల నుండి మరియు స్కూల్స్ లేదా కాలేజీలలో ఒత్తిడి ఉంటుంది. ఫలితంగా తినే ఆహారంపై శ్రద్ధ చూపకపోవటం వలన అధిక బరువు లేక ఊబకాయం వస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బంది రాకుండా ఉండడానికి వయసుకు తగ్గ బరువుతో పెరగటం తప్పనిసరి. ఇదివరకే అధిక బరువు కలిగి ఉన్నవారు వారి బరువు తగ్గించుకునే చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
హెల్తీ ఫుడ్..
టీనేజ్ అబ్బాయిలు.. బరువు తగ్గడానికి ఎలాంటి మంత్రాలు, మ్యాజిక్ లు లేవు. కనుక ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడమే మేలు. బర్గర్, పిజ్జా లు & నూనెతో చేసిన వంటలు పూర్తిగా తగ్గించాలి. ఎప్పుడైనా ఒకసారి తింటే మంచిదే కానీ ఎక్కువగా తింటే బరువు పెరిగే ప్రమాదం ఉంది. ఎక్కువగా పండ్లు, కూరగాయలు, ఐరన్, ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహరం తీసుకుంటే ఆరోగ్యంగా, మంచి బరువుతో ఉంటారు. ఎక్కువగా నీరు తాగటం మరచిపోకూడదు. మంసాహారాలు మరియు నూనె వంటలు తినడం వలన బరువు ఎక్కువయి కొవ్వు పెరిగి ఊబకాయంకి దారి తీస్తుంది.
తినే విధానం..
ఆహారం తినేటప్పుడు నెమ్మదిగా, పూర్తిగా నమిలి తినాలి. ఇలా చేయడం వలన మెదడుకు ఎంత తింటున్నారనే సమాచారం చేరి, కడుపు నిండగానే తినడం ఆపేయమని సలహా ఇస్తుంది. ఒక రోజంతా కొన్ని నిర్ణీతమైన సమయాల్లో ఆహరం తీసుకోవడం ఉత్తమం. ప్రతీ 2 నుంచి 3 గంటలకి ఒకసారి కచ్చితంగా తినాలి. ఒకేసారి ఎక్కువగా తినడం వలన కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఉంది. కొంత మందికి రాత్రి సమయాల్లో కూడా ఆకలి అవుతుంది. అలాంటి సమయాల్లో తినకుండా మంచి నీరు తాగాలి. రాత్రుల్లో దాహాన్ని కూడా ఆకలి అని భ్రమ పడడం సహజం. తినే ప్రతి ఆహరం మితిమీరకుండా తినడం అలవాటుగా మార్చుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు.
వ్యాయామం
బరువు తగ్గాలంటే తక్కువగా లేక మితంగా తినాలి, కానీ అబ్బాయిలు తక్కువ బరువుతో పరిపూర్ణ శరీరం కావాలంటే వ్యాయామం చేయడం తప్పనిసరి. ఆరోగ్యకరమైన ఆహరంతో పాటు తగిన వ్యాయామం చేయాలి. కార్డియో, ఏరోబిక్ మరియు కండరాలని బలోపేతం చేసే వ్యాయామాలు చేసినట్లయితే బరువు తగ్గి, మంచి శరీరం దారుఢ్యం మీ సొంతమవుతుంది. ఇలాంటి వ్యాయామాలు చేసే సమయాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తపడాలి. ప్రతిరోజు వ్యాయామం చేస్తేనే తగిన ఫలితం ఉంటుంది.
తగినంత విశ్రాంతి
తగిన ఆహరం తీసుకొని, వ్యాయామం చేయడం వలన శరీరం చాలా ఒత్తిడికి గురవుతుంది మరియు శరీరం నీరసంగా మారుతుంది. కావున వ్యాయామం తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలి. ఈ విశ్రాంతి వలన మనసు, శరీరం తేలికపడుతుంది. అంతే కాకుండా కండరాలు కూడా బలోపేతంగా అవుతుంది. సరైన చిట్కా ఏంటంటే ఆటలు మరియు పార్టీలు తగ్గించి విశ్రాంతి తీసుకోవడం మంచిది.
తల్లితండ్రులు.. విమర్శించకండి, ప్రోత్సహించండి
టీనేజ్ అబ్బాయిలు ఎవరైనా విమర్శించినపుడు త్వరగా మానిసికంగా బాధపడతారు. తల్లితండ్రులు మంచి ఉదాహరణలతో మరియు సలహాలతో పిల్లలని బరువు తగ్గడానికి ప్రోత్సహించాలి అంతే కాని విమర్శించకూడదు. మీ పిల్లలు బరువు తగ్గేలా ఆరోగ్యకర పద్దతిలో మీ పిల్లలను మీరే ప్రోత్సహించాలి. ఇలాంటి చిట్కాలు పాటిస్తే బరువు తగ్గి, ఆరోగ్యమైన శరీరం మీ సొంతమవుతుంది.
Also Read: Nayanthara Marriage: షాకింగ్.. గుట్టుచప్పుడు కాకుండా పెళ్లిచేసుకున్న స్టార్ హీరోయిన్! ఇదిగో సాక్షం!!
Also Read: ODI World Cup 2022: చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. వన్డే ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్ ఔట్!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook