Anemia prevention Tips: ఈ 4 రకాల జ్యూస్‌లతో రక్తహీనతకు చెక్ పెట్టండి!

Anemia For Health: మీ శరీరంలో రక్తం తక్కువగా ఉంటే, మీరు తప్పనిసరిగా మామిడి మరియు ద్రాక్ష జ్యూస్ ను ఆహారంలో చేర్చుకోండి. ఇది మీ శరీరంలోని బలహీనతను కూడా తొలగిస్తుంది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 30, 2022, 04:05 PM IST
Anemia prevention Tips: ఈ 4 రకాల జ్యూస్‌లతో రక్తహీనతకు చెక్ పెట్టండి!

Anemia prevention Tips For Healthy Body: మీ శరీరంలో రక్తం లేకపోవడం వల్ల అనేక రకాల సమస్యలు పట్టి పీడిస్తాయి. మనకు రక్తహీనత సమస్య ఉన్నప్పుడు కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినమని వైద్యులు సూచిస్తారు. వీటిలో అందరికీ అన్నీ నచ్చకపోవచ్చు. అలాంటి వారు మేము కింద చెప్పిన 4 రకాల జ్యూస్‌ల తాగడం ద్వారా మీ సమస్యకు (Anemia prevention Tips) చెక్ పెట్టవచ్చు. 

1. ద్రాక్ష జ్యూస్
ద్రాక్షపండు జ్యూస్ (Grape Juice) రక్తాన్ని పెంచడంలో సహాయపడుతుందని మీకు తెలుసా? వేసవిలో ఈ జ్యూస్ శరీరాన్ని చల్లగా ఉంచి హిమోగ్లోబిన్ పెంచడంలో తోడ్పడుతుంది. మీరు మొత్తం ద్రాక్షను కూడా తినవచ్చు. 

2. అలోవెరా జ్యూస్
కలబంద రసం చాలా అద్భుతమైన హెర్బ్ అని మీ అందరికీ తెలుసు. ఇది జుట్టుతోపాటు చర్మానికి కూడా మేలు చేస్తుంది, అయితే రోజూ ఒక గ్లాసు కలబంద జ్యూస్ (Aloe vera juice) తాగడం వల్ల రక్తం శుద్ధి అవ్వడమే కాకుండా.. హిమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది.  

3. మామిడి జ్యూస్
వేసవికాలంలో సులభంగా దొరికే పండు మామిడి. దీని వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయి. దీని జ్యూస్ తాగడం వల్ల రక్తం పెరుగుతుంది. 

4. బీట్‌రూట్‌ జ్యూస్ 
రక్తహీనత విషయంలో, వైద్యులు బీట్‌రూట్‌ను ఎక్కువగా తినమని సిఫార్సు చేస్తారు. బీట్‌రూట్‌ను నేరుగా తినడానికి మీకు ఇబ్బందిగా ఉంటే...దానిని జ్యూస్ చేసుకొని తాగండి. , ఈ నాలుగు జ్యూస్ లను మీ ఆహారంలో ఖచ్చితమైన ప్రయోజనాన్ని పొందుతారు. 

Also read: Summer Care: డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు వేసవిలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News