షుగర్‌ని అదుపులో ఉంచుకోండిలా..

షుగర్‌ని అదుపులో ఉంచుకోండిలా..

Last Updated : Sep 26, 2018, 05:26 PM IST
షుగర్‌ని అదుపులో ఉంచుకోండిలా..

ప్రపంచాన్ని భయపెడుతున్న వ్యాధుల్లో షుగర్ ఒకటి. దీన్నే డయాబెటిస్, మధుమేహం, చక్కెరవ్యాధి లాంటి పేర్లతో పిలుస్తుంటారు. భారత్‌లో కూడా లక్షలాది మంది డయాబెటిస్ బారినపడిన వారున్నారు. మధుమేహంలో టైప్1, టైప్2 అని రెండు రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి. టైప్1కి అయితే సూదులు, టైప్ 2కి ఐతే మందులు ఇస్తారు. అయితే ఏ తరహా డయాబెటిస్ అయినా సరే కింద చెప్పిన సూచనలను డాక్టర్ రాసిచ్చిన మందులతో పాటు పాటిస్తే  తేలిగ్గా అదుపులో ఉంచుకోవ‌చ్చు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..!

  • డయాబెటిస్ వచ్చిన వారు ప్రతిరోజూ కొద్దిదూరం వాకింగ్ చేయాలి. బాగా నీళ్లు తాగాలి. డాక్టర్లు కూడా ఇస్తున్న సలహా కూడా ఇదే.
  • దాల్చిన చెక్కకి షుగర్‌ని కంట్రోల్ చేసే గుణం ఉంది. కాబట్టి దాల్చిన చెక్కని నీళ్లలో వేసి మరిగించి.. ఉదయం, సాయంత్రం తీసుకుంటే ఫలితం కనిపిస్తుంది.
  • మొలకెత్తిన గింజలు కూడా తీసుకోవడం షుగర్‌కి మంచిదే.
  • పెద్ద కాకరకాయను ఓ రెండు, మూడు ముక్కలుగా కట్ చేసి నీళ్లలో వేసి మరిగించి.. ఆ వడగట్టిన మిశ్రమాన్ని రోజూ ఉదయాన్నే పరగడుపున తాగితే షుగర్ అదుపులోకి వస్తుంది.
  • అల్ల నేరేడు పండ్లు షుగర్ పేషేంట్స్‌కి మంచిదే.. తులసి ఆకులు కూడా చక్కర స్థాయిలను తగ్గించే శక్తి కలిగి ఉంటాయి.
  • నిత్యం ప‌ర‌గ‌డుపున కొన్ని వెల్లుల్లి రేకుల్ని అలాగే ప‌చ్చిగా తింటే షుగ‌ర్ వ్యాధి నియంత్రణ‌లో ఉంటుంది.
  • కరివేపాకు, బీట్ రూట్, మెంతి ఆకు లేదా పొడి, కలబంద, వేప, జామ ఆకులకు కూడా రక్తంలోని చ‌క్కెర స్థాయిల‌ను త‌గ్గిస్తాయి.
  • ప్రతిరోజూ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఒకే సమయానికి చేసేలా ప్లాన్ చేసుకోవాలి. మజ్జిగ ఒక గ్లాస్ తీసుకోవడం మంచిది.
  • కాఫీ, టీలకు బదులు గ్రీన్ టీ తాగండి. ఇందులో చక్కర స్థాయిని తగ్గించే ఫోలీఫెనోల్స్ ఉంటాయి. అలాగే ఒత్తిడిని కూడా తగ్గిస్తే బెటర్.

Trending News