Health Tips for Pregnant Women: గర్భిణిలు ఆ మెడిసిన్ వాడవద్దు.. కీలక సూచనలు

Health Tips for Pregnant Women |  గర్బధారణ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, అసలే కరోనా వైరస్‌ వ్యాప్తి సమయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గర్భధారణ రెండో దశ సమయం (చివరి నెలలు)లో సాధారణ నొప్పి నివారణకు పెయిన్‌ కిల్లర్స్‌ వాడకూడదని పేర్కొంది.

Last Updated : Oct 26, 2020, 05:13 PM IST
Health Tips for Pregnant Women: గర్భిణిలు ఆ మెడిసిన్ వాడవద్దు.. కీలక సూచనలు

Pain Killers During Pregnancy | మాతృత్వం అనేది సృష్టిలో అత్యంత అద్భుతమైన, విశిష్టతను కలిగి ఉంది. అయితే గర్బధారణ సమయంలో చాలా జాగ్రత్తలు (Health Tips for Pregnants) తీసుకోవాలని, అసలే కరోనా వైరస్‌ (CoronaVirus) వ్యాప్తి సమయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూఎస్‌ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (Food and Drug Administration) కొన్ని కీలక సూచనలు చేసింది. గర్భధారణ రెండో దశ సమయం (చివరి నెలలు)లో సాధారణ నొప్పి నివారణకు పెయిన్‌ కిల్లర్స్‌ వాడకూడదని (Health Tips) పేర్కొంది. కొన్ని రకాల మెడిసిన్‌ వాడితే పుట్టబోయే శిశువులలో అరుదైన మూత్రపిండాల సమస్య తలెత్తుతుందని ఎఫ్‌డీఏ హెచ్చరించింది. 

 

మెడిసిన్‌లపై కొత్త లేబులింగ్‌ విధానాన్ని తీసుకురావాలని సైతం సూచించింది. అలాంటి మెడిసిన్‌ (NSAIDs)ను గర్భం దాల్చిన 20 వారాల తర్వాత తీసుకున్నట్లయితే పుట్టబోయే పిల‍్లలలో అరుదైన, ప్రమాదకరమైన మూత్రపిండాల సమస్యలు తలెత్తుతాయని ఎఫ్‌డీఏ తెలిపింది. NSAIDs మెడిసిన్స్‌లో ఇబుప్రోఫెన్, నాప్రోక్సెన్, డిక్లోఫెనాక్ మరియు సెలెకాక్సిబ్ వంటి మందులు ఉన్నాయని ఎఫ్‌డీఏ పేర్కొంది. వీటిని నొప్పి మరియు జ్వరం సమస్యకు దశాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు.

 

మందులు వాడితే శరీరంలో కొన్ని రసాయనాల ఉత్పత్తిని నిరోధిస్తాయి. అందుకే మహిళలు తమ గర్భధారణ సమయంలో తీసుకునే ఔషధాల లాభాలు, నష్టాలను సైతం తెలుసుకోవాలని FDA సెంటర్ ఫర్ డ్రగ్ ఎవాల్యుయేషన్ అండ్ రీసెర్చ్ విభాగం డైరెక్టర్ ప్యాట్రిజియా కావాజోని అన్నారు.

 

గర్భం దాల్చిన 20 వారాల తరువాత మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తక్కువ మోతాదు అస్పిరిన్‌కు తమ హెచ్చరిక వర్తించదని స్పష్టం చేసింది. గర్భిణులు తక్కువ డోస్ ఉన్న అస్పిరిన్ (81 మి.గ్రా) ట్యాబ్లెట్‌ను వైద్యల సలహా మేరకు తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో గర్భం దాల్చిన దాదాపు 30 వారాల సమయంలో ఇలాంటి మెడిసన్ తీసుకోవద్దని సూచించిన FDA తాజాగా ఆ పరిమితికి 20 వారాలకు కుదించడంతో పాటు తాజా మార్గదర్శకాలు జారీ చేసింది.

Trending News