Heatstroke: ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా ఏం చేయాలంటే..

Heatstroke: ఎండలు దంచి కొడుతున్నాయి. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. వేడి కారణంగా జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో ఆరోగ్యం పరంగా వచ్చే సమస్యలు ఏమిటి? వాటి నుంచి ఎలా జాగ్రత్తగా ఉండాలని అనే విషయంపై నిపుణులు చెబుతున్నా వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 16, 2022, 12:30 PM IST
  • దేశంలో మండిపోతున్న ఎండలు..
  • చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
  • వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Heatstroke: ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా ఏం చేయాలంటే..

Heatstroke: దేశంలో ఎండలు మండిపోతున్నాయం. ఉదయం నుంచే ఎండ తీవ్రత మొదవుతోంది. మధ్యాహ్నం సమయంలో అయితే సూర్యుడు నిపులు కురిపిస్తున్నాడు. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో సగటు ఉష్టోగ్రతలు 40 డిగ్రీలపైనే నమోదవుతున్నట్లు వాతావరణ విభాగం చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరికలు కూడా జారీ చేస్తోంది. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉండనున్న నేపథ్యలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎండ అధికంగా ఉండే సమయాల్లో బయటకు వెళ్లే పనులు పెట్టుకోకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. అలాంటి సమయంలో బయటకు వెళ్లడం వల్ల త్వరగా డీహైడ్రేట్ అవ్వడం, తలనొప్పి, వడదెబ్బ సహా వివిధ సమస్యలు రావచ్చను చెబుతున్నారు. ఇందులో వడ దెబ్బ తగిలితే ఏమవుతుంది? వడ దెబ్బ పడకుండా ఎలా జాగ్రత్త పడాలి ఇప్పుడు తెలుసుకుందాం.

వడ దెబ్బ అంటే ఏమిటి?

శరీర ఉష్టోగ్రత 40 డిగ్రీలు దాటితే వడ దెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువాగ ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల్లో వడదెబ్బ సమస్య అధికంగా ఉంటుంది. వేడిని నియంత్రించే శక్తిని శరీం కోల్పోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. వీరితో పాటు.. ఇంట్లో లేదా ఆఫీస్​లో ఏసీలో ఉండి.. ఒక్కసారిగా బయటకు వచ్చినప్పుడు శరీరం వేడిని నియంత్రించడంలో విఫలమవుతుంది. అలాంటప్పుడు కూడా వడదెబ్బ తగిలే ప్రమాదముంది.

మన శరీరంలో 70 శాతం నీరే ఉంటుంది. తగినంత నీటిని తీసుకోకపోతే.. శరీరంలో అవసరమైన ద్రవాలను కోల్పోతుంది. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందులో కొన్ని సమస్యల గురించి ఇప్పడు తెలుసుకుందాం.

తలనొప్పి..

మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్తై.. ఆ సమయంలో సూర్యుడు సరిగ్గా నడి నెత్తిన ఉంటాడు. అప్పుడు సూర్య కిరణాలు నేరుగా తలపై పడటం వల్ల.. తననొప్పి రావడంతో పాటు కొన్నిసార్లు వడదెబ్బ బారిన పడే అవకాశం ఉంది.

వడదెబ్బ తాకే ముందు కనిపించే లక్షణాలు..

తల తిరగడం

బ్లెడ్​ ప్రెషర్ తగ్గటం లేదా పెరగటం

చర్మం పొడిబారడం

వికారంగా అనిపించడం, వాంతులు రావడం

శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గుండే వేగం పెరగటం

వడదెబ్బ తాకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

మధ్యాహ్నం, ఎండ తీవ్రత అధికంగా ఉండే సమయంలో బయటకు రాకపోవడం ఉత్తమం. ఎల్లప్పుడూ హైడ్రేటెడ్​గా ఉండేందుకు ప్రయత్నించాలి. ఇందుకోసం తరచూ నీళ్లు తాగాలి. తగినంత నీటి శాతం ఉన్నప్పుడే శరీర ఉష్ట్రోగ్రత అదుపులో ఉంటుంది.

తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్తే.. నీడలో ఉండేందుకు ప్రయత్నించాలి.

మధ్యాహ్నం సమయంలో బైక్​లపై దూర ప్రాంతాలకు వెళ్లడం మంచిది కాదు.

మధ్యాహ్నం సమయంలో అధికంగా తినకపోవడం ఉత్తమం. ముఖ్యంగా ప్రొటీన ఫుడ్ మితంగా తీసుకోవాలి. తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు తినాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

చాయ్​, కాఫీ సహా ఇతర కూల్​డ్రింక్స్​ ముఖ్యంగా ఆల్కహాల్​ వంటివి ఎండాకాలంలో ఎక్కువగా తీసుకోకపోవడమే ఉత్తమం.

బయట తిరాగాల్సి వచ్చినప్పుడు రోజుకు రెండు సార్లు స్నానం చేయడం మంచిందట. అలా చేయడం ద్వారా శరీర ఊష్ట్రోగ్రత అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

వీలైనంత వరకు నీడ ప్రదేశాల్లోనే ఉండాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

Also read: Benefits Of Copper Vessel Water: రాగి పాత్రలో ఉంచిన నీరు తాగితే ఇన్ని ప్రయోజనాలా..??

Also read: Kidney Health: మూత్రం రంగు మారిందా.. బీ అలర్ట్.. కిడ్నీ వ్యాధికి సంకేతం కావొచ్చు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News