Tomato Side Effects: ధర ఎక్కువని కాదు..ఆరోగ్యపరంగా కూడా నష్టమే, టొమాటోలు తినవద్దు

Tomato Side Effects: టొమాటో ఆరోగ్యానికి చాలా మంచిది. ఆరోగ్యంతో పాటు సౌందర్య సంరక్షణకు సైతం టొమాటో అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాంటి టొమాటోల విషయంలో కీలకమైన విషయాన్ని వైద్య నిపుణులు అందిస్తున్నారు. జాగ్రత్తగా ఉండమంటున్నారు.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 15, 2023, 11:07 PM IST
Tomato Side Effects: ధర ఎక్కువని కాదు..ఆరోగ్యపరంగా కూడా నష్టమే, టొమాటోలు తినవద్దు

Tomato Side Effects: ప్రతి భారతీయ కిచెన్‌లో టొమాటో తప్పకుండా ఉండాల్సిందే. అంతెందుకు టొమాటో లేకుండా ఏ ఒక్క కూర కూడా వండరంటే అతిశయోక్తి కానేకాదు. భారతీయ వంటల్లో అంతగా భాగమైన టొమాటో గురించి ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. కొంతమంది టొమాటో వినియోగానికి దూరంగా ఉంటే మంచిదనే హెచ్చరిక జారీ అవుతోంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా టొమాటో ధర మండిపోతోంది. రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి టొమాటో ధరలు. కిలో టొమాటో కొన్ని ప్రాంతాల్లో 300 రూపాయలు చేరింది. కొన్ని ప్రాంతాల్లో 200-250 రూపాయలు పలుకుతోంది. బహుశా అందుకే ఆరోగ్యానికి ఎంత మంచిదైనా, భారతీయ వంటల్లో ఎంతగా భాగమైనా అయిష్టంగానే టొమాటోను దూరం పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. టొమాటో ధర ఆకాశాన్నంటుతుండటంతో టొమాటో కొనాలంటేనే భయపడే పరిస్థితి తలెత్తింది. అదే సమయంలో టొమాటోల గురించి కొన్ని షాకింగ్ విషయాలు కూడా వెల్లడయ్యాయి. టొమాటోలను ఇప్పటివరకూ ఆరోగ్యపరంగా మంచిదనే విన్నాం. కానీ టొమాటోలతో కూడా దుష్పరిణామాలు ఎదురౌతాయని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. కొన్ని అనారోగ్య సమస్యలున్నవాల్లు టొమాటోలు తినకూడదని వైద్యులు తెలిపారు. 

చాలామందికి యాసిడ్ రిఫ్లక్స్ పరిస్థితి ఉంటుంది. ఈ సమస్యతో బాధపడేవారికి టొమాటోలు మంచిది కాదు. టొమాటో తినడం వల్ల అనారోగ్యం కలుగుతుంది. ఈ సమస్యతో బాధపడేవాళ్లు టొమాటోలు తినడం వల్ల కడుపు మంట సమస్య తలెత్తుతుంది. టొమాటోలు తిన్న తరవవాత గుండెల్లో మంట, అజీర్ణ సమస్య, జీర్ణాశయ సమస్య వెంటాడుతుంది. 

చాలామందికి రక్తం త్వరగా గడ్డకట్టదు. దీనికోసం మందులు వినియోగిస్తుంటారు. టొమాటోల వల్ల రక్తం గడ్డకట్టేలా చేసే మందులకు హాని కలుగుతుంది. రక్తం పలుచగా ఉండేవాళ్లు టొమాటోలకు దూరంగా ఉంటే మంచిది. ఇక అందరికంటే ఎక్కువ జాగ్రత్త పడాల్సింది కిడ్నీ సమస్యలున్నవాళ్లు.  కిడ్నీలో రాళ్లుంటే టొమాటో వంటి ఆక్సలేట్ స్టోన్స్ పదార్ధాలను తినకూడదు. ఎందుకంటే టొమాటోల్లో ఉండే ఆక్సలేట్ అనే పదార్ధం కిడ్నీలో రాళ్లను పెరిగేలా చేస్తుంది. 

ఇక అలర్జీ సమస్యలున్నా కూడా టొమాటో దూరంగా పెట్టాల్సిందే. చాలామందికి కొన్ని రకాల పదార్ధాలంటే ఎలర్జీ ఉంటుంది. లేదా దగ్గు, రొంప అలర్జీ కారణంగా వస్తుంటుంది. ఈ పరిస్థితుల్లో టొమాటో అస్సలు వినియోగించకూడడు. 

Also read: Red Rice Benefits: మీ గుండెను పదిలంగా కాపాడే రైస్ ఇదే, రోజు తింటే శరీరానికి బోలెడు లాభాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News