Health Care Tips: శరీరానికి కావల్సిన పోషకాలైన విటమిన్లు, మినరల్స్ కావాలంటే తీసుకునే ఆహారం బాగుండాలి. ముఖ్యంగా ఐరన్ అధికంగా ఉండే ఆహారం డైట్‌లో ఉండేట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఐరన్ అనేది ప్రతి వయస్సులోనూ అత్యవసరమైన మినరల్.
శరీరంలో సంపూర్ణంగా ఎదిగేందుకు విటమిన్లు, మినరల్స్ అవసరమౌతుంటాయి. ఇందులో ఒకటి ఐరన్. చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా కీలకమైన, అత్యవసరమైన ఐరన్‌ను నిర్లక్ష్యం చేస్తుంటాము. శరీరంలో ఐరన్ ఉండటం వల్లనే సరిగ్గా పనిచేస్తుంది. ఐరన్ ద్వారానే శరీరంలో రెడ్ బ్లడ్ సెల్స్ ఏర్పడతాయి. ఐరన్ లోపం ఉంటే ఎనీమియాకు దారితీస్తుంది.
ఐరన్ లోపముంటే కన్పించే లక్షణాలు
తరచూ చిన్న చిన్న పనులకే అలసట రావడం
అదే పనిగా గొంతెండిపోతుండటం
ఎక్కువగా దాహం వేయడం
హెయిర్ ఫాల్ సమస్య వేధించడం
గొంతులో గరగర పెరగడం
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
ఐరన్ ఏ వయస్సువారికి ఎక్కువ అవసరం
వయస్సు,ని బట్టి మగవారికి, ఆడవారికి ఐరన్ అవసరం వేర్వేరుగా ఉంటుంది. చిన్నారులతో పోలిస్తే యువకులకు ఐరన్ అవసరం ఎక్కువ ఉంటుంది. మహిళలకు పీరియడ్స్ సందర్భంగా జరిగే రక్తస్రావం కారణంగా మగవారితో పోలిస్తే మహిళలకు ఎక్కువ ఐరన్ అవసరముంటుంది.
4-8 ఏళ్ల వయస్సు పిల్లలకు రోజుకు 10 మిల్లీగ్రాముల ఐరన్
9-13 ఏళ్ల వయస్సు పిల్లలకు రోజుకు 8 మిల్లీగ్రాముల ఐరన్
19-50 ఏళ్ల మహిళలకు రోజుకు 18 మిల్లీగ్రాముల ఐరన్
19-50 ఏళ్ల మగవారికి రోజుకు 8 మిల్లీగ్రాముల ఐరన్
శరీరం ఆరోగ్యం కోసం రోజూ తప్పకుండా ఐరన్ తీసుకోవల్సి ఉంటుంది. మరి శరీరానికి కావల్సిన పరిమాణంలో ఐరన్ ఏయే ఆహార పదార్ధాల్లో ఉన్నాయో పరిశీలించాలి. ఇందులో ముఖ్యంగా బాదం, జీడిపప్పు, అఖ్రోట్, తులసీ, బెల్లం, మునగకాయ, నువ్వుులు, బీట్‌రూట్, ఉసిరి, నేరేడు, పిస్తా, నిమ్మకాయ, దానిమ్మ, ఆపిల్, పాలకూర, ఎండు ద్రాక్ష, అంజీర్, జాంకాయలు, అరటి, స్ప్రౌట్స్‌లో ఐరన్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది.
Also read: Skin Care Cream: మీ చర్మం మృదువుగా, నిగనిగలాడాలంటే ఈ హ్యాండ్‌క్రీమ్ రాస్తే చాలు, తయారీ ఎలాగంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook