Diabetes Tips: డయాబెటిస్ అనేది ప్రపంచమంతా ఉన్న వ్యాధి. ఇండియా అయితే ప్రతి పదిమందిలో ఆరుగురికి మధుమేహం ఉంటోందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. డయాబెటిస్ వ్యాధికి సరైన చికిత్స ఇప్పటికీ లేదు. కేవలం నియంత్రణ మాత్రమే సాధ్యం. అందుకే ఎప్పటికప్పుడు మధుమేహం ఉందా లేదా అనేది పరీక్షల ద్వారా తెలుసుకోవాలి.
దేశంలో డయాబెటిస్ ముప్పు చాలా ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా యువతలో ఈ వ్యాధి ఎక్కువగా సోకుతోంది. కారణంగా స్థూలకాయం, జీన్స్, చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి ఇందుకు ప్రధాన కారణం. ఓ అధ్యయనం ప్రకారం 16-44 ఏళ్ల వారిిలో 50 శాతం మంది మధుమేహం బారినపడుతున్నారు. ముందుగా మధుమేహం వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.
మధుమేహం ఉంటే రాత్రిపూట తరచూ మూత్రానికి వెళ్తుంటారు. దాహం ఎక్కువగా వేస్తుంటుంది. నీరసంగా ఉండటం లేదా ఆకశ్మికంగా బరువు తగ్గడం ఉంటుంది. యోని లేదా అంగంపై దురద ఎక్కువగా ఉంటుంది. దెబ్బలు తగిలితే మానేందుకు సమయం పడుతుంది. కళ్లు మసకగా కన్పిస్తాయి. ఈ లక్షణాలు మీలో కన్పిస్తే వెంటనే అప్రమత్తమై వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకంటే మధుమేహం తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు నియంత్రణ చాలా సులభమౌతుంది.
ఇవి కాకుండా చర్మం పెచ్చులు ఊడటం, తరచూ జబ్బు పడటం, దురద, నోరు ఆరిపోవడం, చికాకు, చర్మం మొద్దుబారినట్టుండటం, దంతాలు దెబ్బతినడం, నోటి నుంచి దుర్వాసన కూడా డయాబెటిస్ లక్షణాలే. స్థూలకాయం ఉన్నవారిలో డయాబెటిస్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
డయాబెటిస్ నియంత్రణ అనేది పూర్తిగా ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. డైట్ ఛార్ట్ సిద్ధం చేసుకోవాలి. స్వీట్స్‌కు పూర్తిగా దూరం పాటించాలి. ధూమపానం, మద్యపానం వదిలేయాలి. రక్తపరీక్షలతో పాటు వైద్య పరీక్షలు కూడా చేయించుకోవాలి. క్రమం తప్పకుండా వాకింగ్ లేదా వ్యాయామానికి తగిన సమయం కేటాయించాలి.
Also read: Vangaveeti Radha: వంగవీటి రాధాకు దక్కని సీటు, మరి ఆయన పయనమెటు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook