చలికాలంలో సహజంగానే ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. ముఖ్యంగా కొన్ని రకాల పదార్ధాలను దూరంగా పెట్టకపోతే..అధిక రక్తపోటు సమస్య పెరిగిపోతుంది. ఆ వివరాలు మీ కోసం..
అధిక రక్తపోటు నియంత్రణ చాలా అవసరం. లేకపోతే గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యలు తలెత్తుతాయి. సకాలంలో రక్తపోటును నియంత్రించక పోతే మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది. ఈ క్రమంలో బీపీ రోగులు బ్లడ్ లెవెల్స్ నియంత్రించేందుకు కొన్ని పదార్ధాల్ని తక్షణం డైట్ నుంచి దూరం పెట్టాలి. ఆ పదార్దాలను దూరం చేస్తే అధిక రక్తపోటు నుంచి తప్పించుకోవచ్చు. ఆ పదార్ధాలు ఏంటి, ఏం చేయాలనేది తెలుసుకుందాం..
పికిల్స్-పచ్చళ్లు
హై బీపీ రోగులు పికిల్స్ ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే పికిల్స్‌లో సహజంగానే ఉప్పు ఎక్కువగా ఉండటంతో శరీరంలో సోడియం లెవెల్స్ పెరిగిపోతాయి. ఫలితంగా గుండె వ్యాధులైన హార్ట్ ఎటాక్ ముప్పు పెరిగిపోతుంది. అందుకే రక్తపోటు సమస్యతో బాధపడేవాళ్లు పచ్చళ్లకు దూరంగా ఉండాలి.
ప్రోసెస్డ్ మీట్ అండ్ స్వీట్స్
ప్రోసెస్డ్ మీట్‌లో కూడా సోడియం పరిమాణం ఎక్కువగా ఉంటుంది. అందుకే రక్తపోటు వ్యాధిగ్రస్థులు తక్షణం ప్రోసెస్డ్ మీట్‌ను మానేయాలి. మరోవైపు అధిక రక్తపోటు రోగులు స్వీట్స్ కూడా తినకూడదు. స్వీట్స్ అనేవి సహజంగా ఆరోగ్యానికి మంచివి కావు. పంచదార అనేది స్థూలకాయం, దంత సమస్యలకు దారితీస్తుంది.
పిజ్జా, చిప్స్
హై బీపీ రోగులు ఎప్పుడూ తినే ఆహారపదార్ధాలు, పానీయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. బీపీ రోగులు పిజ్జా, చిప్స్, హాట్ పదార్ధాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ పదార్ధాలు రక్తపోటును మరింత పెంచేస్తాయి. ఎందుకంటే వీటిలో సోడియం ఉంటుంది.
Also read: Cholesterol Tips: ఈ ఐదు నేచురల్ హెర్బ్స్ డైట్‌లో ఉంటే చాలు..కొలెస్ట్రాల్ 28 రోజుల్లో మాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook