Diabetes Control Tips: డయాబెటిస్ నియంత్రించాలంటే డిన్నర్ తరువాత ఈ పని తప్పకుండా చేయాల్సిందే

Diabetes Control Tips: ఆధునిక జీవవశైలి వ్యాధుల్లో అతి ముఖ్యమైంది ప్రమాదకరమైంది డయాబెటిస్. డయాబెటిస్ వ్యాధి ఒకసారి సోకితే నియంత్రణే తప్ప నిర్మూలన సాధ్యం కాదు. రక్తంలో చక్కెర స్థాయిని బట్టి నియంత్రణలో ఉందో లేదో చెప్పవచ్చు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 11, 2023, 08:28 PM IST
Diabetes Control Tips: డయాబెటిస్ నియంత్రించాలంటే డిన్నర్ తరువాత ఈ పని తప్పకుండా చేయాల్సిందే

Control Blood Sugar Levels with these Tips: అయితే డయాబెటిస్ నియంత్రణ అనేది పూర్తిగా మన చేతుల్లో ఉన్నదే. కానీ కొన్ని సందర్భాల్లో ఎంత ప్రయత్నించినా బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గవు. ఆశించిన ఫలితాలు కన్పించవు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని చిట్కాలు ఆచరిస్తే మంచి ఫలితాలుంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా రాత్రి భోజనం తరువాత ఆ ఒక్క పని చేస్తే చాలంటున్నారు.

మధుమేహం అనేది సాధారణంగా కన్పించే తీవ్రమైన వ్యాధి. ఎంత తీవ్రమైందో అంతే సులభంగా నియంత్రించుకోవచ్చు. ఎప్పటికప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ పరీక్షించుకుంటూ ఉండాలి. లేకపోతే ఆరోగ్యం ఎప్పుడు ఎలా వికటిస్తుందో చెప్పలేం. ఎందుకంటే ఒక్కోసారి హఠాత్తుగా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి. డయాబెటిస్ కారణంగా ఇతర చాలా వ్యాధులు చుట్టుముడతాయి. అనేక సమస్యలు కూడా ఉత్పన్నమౌతాయి. అందుకే హెల్తీ ఫుడ్ తినడం, జీవనశైలి మెరుగుపర్చుకోవడం చాలా అవసరం. ఇటీవలి కాలంలో ఎక్కడ చూసినా జీవనశైలి సరిగ్గా ఉండదు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండేవాళ్లు ఎప్పటికప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుని అందుకు తగ్గట్టుగా ఆహారపు అలవాట్లు మార్చుకుంటారు.

రాత్రి భోజనం అనేది దినసరి ఆహారంలో కీలకం. అందుకే మధుమేహం వ్యాధిగ్రస్థులు రాత్రి భోజనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రాత్రి వేళ హెల్తీ ఫుడ్ తీసుకున్న తరువాత ముఖ్యంగా ఓ పని చేయాలి. రాత్రి డిన్నర్ ముగిసిన తరువాత కనీసం 10-15 నిమిషాలు అటూ ఇటూ తిరగాలి. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. క్రమం తప్పకుండా ప్రతి రోజూ ఇది ఫాలో అయితే కొన్నిరోజుల్లోనే మంచి ఫలితాలు కన్పిస్తాయి.

Also Read: Uric Acid Control Tips: యూరిక్ యాసిడ్ ఎందుకు ప్రమాదకరం, తగ్గించే మార్గాలేంటి

అన్‌హెల్తీ ఫుడ్స్‌కు దూరం

ఇండియాలో సాధారణంగానే ఆయిలీ, స్వీట్ ఫుడ్స్ అంటే మక్కువ ఎక్కువ. ఫలితంగా కొలెస్ట్రాల్, డయాబెటిస్, హార్ట్ ఎటాక్ ముప్పు ఎక్కువౌతుంటుంది. ప్రత్యేకించి మధుమేహ వ్యాధిగ్రస్థులు అన్‌హెల్తీ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. హెల్టీ డైట్ ఏం తీసుకోవాలనేది ఎవరైనా డైటిషియన్‌ను సంప్రదించి తెలుసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఆకలిని నిర్లక్ష్యం చేయకూడదు

చాలా సందర్భాల్లో పనిలో పడి బిజీగా మారిపోతుంటాం. ఎంతలా ఉంటే భోజనం కూడా మానేస్తుంటాం. కానీ ఆకలిగా ఉన్నప్పుడు ఇలా చేయడం మధుమేహం వ్యాధిగ్రస్థులకు భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి కల్పిస్తుంది. అందుకే ఏ మాత్రం కొద్దిగా ఆకలేసినా పండ్లు, శెనగలు, సలాడ్ వంటి హెల్తీ స్నాక్స్ తినాలనే సలహా ఇస్తుంటారు వైద్యులు. ఆకలిని నిర్లక్ష్యం చేస్తే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండవు.

Also Read: Dehydration Signs: బాడీ డీ హైడ్రేట్ అవుతుంటే ఈ లక్షణాలతో గుర్తించవచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News