Detox Foods: శరీరాన్ని ఎందుకు డీటాక్స్ చేయాలి, డీటాక్స్ చేసే పద్ధతులేంటి

Detox Foods: శరీరాన్ని డీటాక్స్ చేయడం చాలా అవసరం. ముఖ్యంగా వేసవిలో. డీటాక్సిఫికేషన్ వల్ల శరీరంలోని విష పదార్ధాలు తొలగిపోతాయి. మరి శరీరాన్ని డీటాక్స్ ఎలా చేయాలి, ఏ పద్ధతులు అవలంభించాలనేది తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 27, 2023, 03:16 PM IST
Detox Foods: శరీరాన్ని ఎందుకు డీటాక్స్ చేయాలి, డీటాక్స్ చేసే పద్ధతులేంటి

ఆధునిక జీవనశైలి కారణంగా వివిధ రకాల ఆహారపు అలవాట్లతో అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. ముఖ్యంగా బయటి తిండి తినడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు తలెత్తుతుంటాయి. ఈ పరిస్థితుల్లో శరీరాన్ని డీటాక్స్ చేయాల్సి ఉంటుంది. 

బయటి తిండి తిన్నప్పుడు శరీరాన్ని తప్పనిసరిగా డీటాక్స్ చేయాలి. ఎందుకంటే డీటాక్స్ చేయడం వల్ల శరీరంలోని విష పదార్ధాలు బయటకు తొలగిపోయి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. చాలా సందర్భాల్లో ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడం వల్ల వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో బాడీని డీటాక్స్ చేస్తే శరీరం ఫిట్‌గా ఉంటుంది. మరి డీటాక్స్ చేయాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..

డీటాక్స్ చేసే పద్ధతులు

నిమ్మ

నిమ్మకాయలో సోడియం, ఐరన్, విటమిన్ సి అధికంగా ఉంటాయి. నిమ్మరసం తాగడం వల్ల చాలా రకాల సమస్యలు దూరమౌతాయి. శరీరాన్ని డీటాక్స్ చేసేందుకు నిమ్మ అద్భుతంగా పనిచేస్తుంది. నిమ్మరసంతో ఇమ్యూనిటీ వృద్ధి చెందడమే కాకుండా..విష పదార్ధాలు చాలా సులభంగా తొలగిపోతాయి. అందుకే శరీరాన్ని డీటాక్స్ చేసేందుకు రోజూ నిమ్మరసం తాగడం చాలా మంచిది.

కాలిఫ్లవర్

కాలిఫ్లవర్ అనేది శరీరానికి చాలా చాలా మంచిది. దీంతో అద్బుతమైన ప్రయోజనాలున్నాయి. కాలిఫ్లవర్ తినడం వల్ల శరీరం డీటాక్స్ అవుతుంది. ఎందుకంటే కాలిఫ్లవర్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. శరీరాన్ని డీటాక్స్ చేయడంతో పాటు కడుపుని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. కాలిఫ్లవర్ సలాడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు.

కొబ్బరి నీళ్లు

కొబ్బరి నీళ్లను అమృతంతో పోల్చవచ్చు. ఆరోగ్యానికి అంత మంచివి. శరీరాన్ని డీటాక్స్ చేయడంలో కొబ్బరి నీళ్లను మించినవి లేవు. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలోని విష పదార్ధాలు బయటకు తొలగి..శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో సోడియం, పొటాషియం, విటమిన్ సి పెద్దమొత్తంలో ఉంటుంది. శరీరం డీటాక్స్  అయితే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. 

Also read: Heart Attack: వయస్సు 40 దాటినా గుండెపోటు ముప్పుండకూడదంటే ఈ 4 పదార్ధాలు చాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News