Walnut Shells: సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చే పదార్ధాల్లో డ్రై ఫ్రూట్స్ స్థానం కీలకమైంది. డ్రై ఫ్రూట్స్ అనగానే సాధారణంగా గుర్తొచ్చేవి బాదం, వాల్నట్స్, జీడిపప్పు, పిస్తా, అంజీర్, ఖర్జూరం ఇలా చాలా ఉంటాయి. అన్నీ ఆరోగ్యానికి మంచివే. అద్భుత ప్రయోజనాలు కల్గించేవే. వీటన్నింటిలో టాప్‌గా వాల్నట్స్ని చెప్పుకోవచ్చు.
వాల్నట్స్ అనేవి అద్బుతమైన డ్రై ఫ్రూట్స్‌లో ఒకటి. ఇందులో హెల్తీ ఫ్యాట్, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లతో పాటు కాల్షియం, జింక్, ఐరన్, కాపర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. చుట్టూ గట్టి షెల్ ఉండి మద్యలో లోపలిభాగంలో నట్స్ ఉంటాయి. వాల్నట్స్ తినేటప్పుడు సాధారణంగా చుట్టూ ఉన్న షెల్స్ పాడేస్తుంటాము. కానీ వాల్నట్స్ ఒక్కటే కాదు వాటి షెల్స్‌తో కూడా చాలా ప్రయోజనాలున్నాయి. వాల్నట్స్ షెల్స్ ప్రయోజనాలు తెలిస్తే ఇంకెప్పుడూ వాటిని వదిలిపెట్టరు.
వాల్నట్ షెల్స్ కూడా ఉపయోగపడతాయని, వాటితో ఆరోగ్యపరంగా ప్రయోజనాలున్నాయని చాలామందికి తెలియదు. ఇందులో కూడా విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. వీటి వల్ల చాలా రకాల వ్యాధులు దూరమౌతాయి. ఆరోగ్యం కోసం గ్రీన్ టీ, లెమన్ టీ వంటివి చాలా ఉపయుక్తంగా ఉంటాయి. అదే విధంగా వాల్నట్ షెల్స్‌తో చేసే టీతో అద్భుత ప్రయోజనాలున్నాయి.
ముందుగా వాల్నట్ షెల్స్ ఓ గిన్నెలో తీసుకుని నీళ్లు వేసి ఉడికించాలి. దాదాపు అరగంట ఉడికించాలి. ఆ తురవాత స్టౌవ్ ఆపి,,ఈ మిశ్రమాన్ని వడపోయాలి. అంచే గోరువెచ్చగా తాగాలి. రుచి కోసం కొద్దిగా నిమ్మరసం జోడించవచ్చు. వాల్నట్ షెల్స్ టీ తాగడం వల్ల అంటువ్యాధుల ముప్పు తొలగిపోతుంది. జలుబు, జ్వరం, దగ్గు వంటి వ్యాధుల్నించి రక్షణ కలుగుతుంది. ప్రధానంగా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అదే పనిగా ముక్కు కారే సమస్య ఉంటే వాల్నట్ షెల్స్ టీ తాగితే మంచి ఫలితాలుంటాయి. కడుపు చుట్టూ, నడుము చుట్టూ ఉండే కొవ్వు కూడా వేగంగా కరుగుతుంది.
Also read: Health Tips: అన్ని పండ్లు ఆరోగ్యానికి మంచివి కావా, ఈ పండ్లు పరగడుపున తింటే ఏమౌతుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook