Fennel Seeds in Summer: వేసవిలో సోంపుతో ఇన్ని ప్రయోజనాలా..? తెలిస్తే ఇపుడే మీ డైట్ లో కలుపుకుంటారు!

Fennel Seeds Benefits in Summer: బరువు తగ్గించుకునేందుకు చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ప్రతి కిచెన్‌లో తప్పకుండా లభించే చిన్న చిన్న పదార్ధాలతోనే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. బరువు తగ్గించడమే కాకుండా ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 15, 2023, 11:43 AM IST
Fennel Seeds in Summer: వేసవిలో సోంపుతో ఇన్ని ప్రయోజనాలా..? తెలిస్తే ఇపుడే మీ డైట్ లో కలుపుకుంటారు!

Benefits Fennel Seeds in Summer: వేసవిలో చాలామంది బరువు తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. డైటింగ్, వ్యాయామం చేయడం వంటివి చేసినా విఫలమౌతుంటారు. అయితే కిచెన్‌లో లభించే కొన్ని వస్తువులతో అధిక బరువు సమస్యను అద్భుతంగా తగ్గించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ప్రకృతిలో లభించే కొన్ని రకాల వస్తువుల్లో అద్భుతమైన పోషక గుణాలుంటాయి.

ప్రతి కిచెన్‌లో తప్పకుండా లభించే సోంపు ప్రయోజనాలు అందరికీ తెలిసినవే. సాధారణంగా తిన్నది అరగడానికి సోంపు తింటుంటారు. నోటి దుర్వాసన లేకుండా ఉండేందుకు కూడా చాలామంది సోంపు తీసుకుంటారు. ఇందులో ఉండే విటమిన్లు, కాల్షియం, ఫైబర్, మెగ్నీషియం పోషకాలు ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుస్తాయి. సోంపు స్వభావం చలవచేసేది కావడంతో వేసవిలో సోంపు తరచూ తీసుకుంటే చాలా మంచిది. సోంపు వల్ల శరీరానికి చలవ చేస్తుంది. కడుపులో వేడి ఉంటే తగ్గుతుంది. సోంపు రోజూ తినడం వల్ల ఊహించని చాలా లాభాలున్నాయి.

సోంపుతో కలిగే ప్రయోజనాలు

అధిక బరువుకు చెక్

వేసవిలో మీరు బరువు తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తుంటే సోంపు తప్పకుండా వినియోగించాల్సిందే. సోంపు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మెటబోలిజంను వేగవంతం చేస్తుంది. ఫలితంగా బరువు తగ్గించేందుకు దోహదమౌతుంది.

Also Read: Heart Health Tips: హార్ట్ ఎటాక్ ముప్పును దూరం చేసి, గుండెను ఆరోగ్యంగా ఉంచే పద్ధతులు

ఇమ్యూనిటీ

సోంపులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పెద్దమొత్తంలో ఉంటాయి. సోంపు తినడం వల్ల ఇమ్యూనిటీ పటిష్టంగా ఉంటుంది. శరీరాన్ని వివిధ రకాల వ్యాధుల్నించి తట్టుకునే శక్తి కలుగుతుంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా భోజనం తరువాత సోంపు తినడం అలవాటు చేసుకోవాలి. 

శరీరానికి చలవ..

వేసవిలో కాలంలో శరీరంలో అంతర్గతంగా, బహిర్గతంగా వేడి పెరిగిపోతుంది. సోంపు రోజూ తినడం వల్ల శరీరానికి చలవ చేస్తుంది. సోంపు స్వభావం చలవ చేసేది కావడం వల్ల బాడీ హీట్ కాకుండా చేస్తుంది. కడుపులో వేడి దూరమౌతుంది. సోంపు రోజూ తినడం వల్ల బాడీ డీటాక్స్ అవుతుంది. రక్తం శుభ్రమౌతుంది. 

జీర్ణక్రియ

సోంపుని అనాదిగా జీర్ణక్రియ మెరుగ్గా ఉండేందుకు తీసుకుంటుంటారు. తిన్న ఆహారం అరిగేందుకు సోంపు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. సోంపును నేరుగా బోజనం తరువాత లేదా ఉదయం పరగడుపున సోంపు మరగబెట్టిన నీళ్ల రూపంలో తీసుకోవచ్చు.

Also Read: Mangoes vs Diabetes: డయాబెటిక్ రోగులు మామిడి పండ్లు తినవచ్చా లేదా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News