Cancer Signs in Nails: గోర్ల రంగు మారినా, అసాధారణంగా ఉంటున్నాయా, ఈ ప్రమాదకర వ్యాధులు కావచ్చు

Cancer Signs in Nails: శరీరంలో జరిగే వివిధ రకాల మార్పులు లేదా తలెత్తే అనారోగ్య సమస్యలు వివిధ రూపాల్లో బయటపడుతుంటాయి. ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే ప్రాణాంతకం కావచ్చు. పూర్తి వివరాలు మీ కోసం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 12, 2023, 10:27 PM IST
Cancer Signs in Nails: గోర్ల రంగు మారినా, అసాధారణంగా ఉంటున్నాయా, ఈ ప్రమాదకర వ్యాధులు కావచ్చు

Cancer Signs in Nails: ఆధునిక జీవన శైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా వివిధ రకాల వ్యాధులు ఎదుర్కోవల్సి వస్తోంది. అయితే శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా ఇప్పటికీ సరైన చికిత్స లేని వ్యాధి ప్రాణాంతకమైన కేన్సర్. కేన్సర్ ఎంత ప్రాణాంతకమైనా సకాలంలో కొన్ని సంకేతాల ద్వారా గుర్తించవచ్చంటున్నారు. 

మనిషి శరీరంలో అంతర్గతంగా ఏదైనా పెను సమస్య తలెత్తినప్పుడు ముందుగా ప్రభావం కన్పించేది గోర్లు, నాలుక, కళ్లలోనే. అందుకే చాలామంది వైద్యులు నాలుక, కళ్లు కచ్చితంగా పరిశీలిస్తుంటారు. ఎందుకంటే చాలా రకాల వ్యాధుల రహస్యం వీటిలోనే దాగుంటుంది. కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల సంకేతాలు సైతం గోర్లలోనే కన్పిస్తాయి.

ఒక్కోసారి గోర్ల రంగు మారడం లేదా గోర్లు విరుగుతుండటం లేదా కుదించుకుపోవడం వంచి లక్షణాసలు కన్పిస్తుంటాయి. గోరు రంగు మారితే కాలేయం, ఊపిరితిత్తులు, గుండె సంబంధిత సమస్యలు రావచ్చని సంకేతం. అందుకే గోరు రంగులో మార్పు వస్తే తక్షమం అలర్ట్ అయిపోవాలి. వైద్యుడిని సంప్రదించాలి. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ అసోసియేషన్ ప్రకారం గోర్లపై నల్లటి మచ్చలు కన్పిస్తే అది చర్మ కేన్సర్‌కు సంకేతం కావచ్చు. గోర్లపై ముదురు గీతల వంటివి అభివృద్ధి చెందుతుంటే మెలనోమా వ్యాధి సంకేతం కావచ్చు.

కొంతమందికి గోర్లు పైకి లేచి కన్పిస్తాయి. రంగు తెల్లగా లేదా ఇతర రంగుల్లో కన్పించినా వివిద రకాల ఫంగల్ ఇన్‌ఫెక్షన్ కావచ్చు. గోరు చుట్టూ వాపున్నా లేదా ఎరుపు రంగు కన్పించినా తక్షణం వైద్యుడిని సంప్రదించాలి. ఈ పరిస్థితిని పరోనిచియా అంటారు. గోరు రంగు నల్లగా మారినా, పచ్చగా కన్పించినా బ్యాక్టీరియా ప్రభావం ఉందని సంకేతం. వెంటనే చికిత్స చేయించకపోతే ప్రమాదకరం కావచ్చు.

ఇక కొంతమందిలో గోర్లకు పిన్ హోల్స్ కన్పిస్తుంటాయి. సోరియాసిస్, అటోపిక్ డెర్మటైటిస్, అలోపేసియా లక్షణం కావచ్చు. గోర్లు పసుపుపచ్చగా, సన్నగా కన్పించినా లేదా గోర్లు పెరగకపోయినా ప్రమాదకర సంకేతమే. గోర్ల మధ్య గ్యాప్ ఉండటం మానసిక సమస్యకు సంకేతం కావచ్చు. గోర్లు నిస్తేజంగా పొడిబారి ఉంటే థైరాయిడ్ సమస్య కావచ్చంటున్నారు. 

Also read: Fenugreek Seeds Tea For Diabetes: బోలెడు ఔషధ గుణాలు కలిగిన ఈ టీతో మధుమేహం శాశ్వతంగా దూరం..

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News