Banana Milk Shake: మనం తినే ఆహారం లేదా పండ్ల విషయంలో ఎప్పుడూ ఒకింత జాగ్రత్త అవసరం. కొన్ని రకాల పండ్ల కాంబినేషన్ ఆరోగ్యానికి హాని కల్గించే ప్రమాదముంది. మిల్క్ అండ్ బనానా షేక్ గురించి విన్నారా..ఇది ఆరోగ్యానికి ఎంతవరకూ మంచిదో తెలుసుకుందాం..
మెరుగైన ఆరోగ్యానికి కొన్ని పండ్లు లేదా పదార్ధాలు మంచివి కావంటున్నారు ఆరోగ్య నిపుణులు. విడివిడిగా ఆరోగ్యానికి మంచివై ఉండి..కాంబినేషన్ మాత్రం హాని కారకమౌతున్నాయి. అందులో ఒకటి బనానా మిల్క్ షేక్. జిమ్ ట్రైనర్లు చాలామంది బనానా మిల్క్ షేక్ తాగమని సూచిస్తుంటారు. వేసవిలో అయితే చాలామంది ఇష్టంగా తాగుతుంటారు. కానీ బనానా మిల్క్ షేక్ అనేది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. కారణాలేంటో తెలుసుకుందాం..
పాలు, అరటి పళ్లు కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. అరటిపళ్లలో ఉండే పైబర్, పాలలో ఉండే కాల్షియం కారమంగా రెండూ ఒకేసారి కలిపి తీసుకోకూడదు. ఎందుకంటే ఈ రెండూ కలిపి తీసుకుంటే హార్మోన్స్‌పై ప్రభావం పడుతుంది. ఫలితంగా మెదడు ప్రభావితమౌతుంది. ఆయుర్వేద శాస్త్రంలో ఏదైనా తినే వస్తువును మరో పదార్ధంతో కలిపి సాధ్యమైనంతవరకూ తీసుకోవద్దనే ఉంది. పాలు, అరటిపళ్ల కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో విష పదార్ధాలు ఉత్పన్నమౌతాయి. ఇవి హార్మోన్ వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి. ఈ రెండూ కలిపి తీసుకోవడం వల్ల పలు రోగాలు కూడా వస్తాయంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు.
గర్భిణీ మహిళలకు నష్టం
గర్భం దాల్చిన తరువాత మహిళలు తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే కడుపులో బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అందుకే ఏం తినాలి, ఏం తినకూడదనేది ఆలోచించుకోవాలి. ముఖ్యంగా పాలు, అరటి పళ్లు కలిపి తీసుకోకూడదు. ఎందుకంటే ఈ రెంటి మిశ్రమం వల్ల విష పదార్ధాలు పెరిగి..ఎలర్జీ వంటి చాలా సమస్యలు ఎదురౌతాయి. దాంతో కడుపులో బిడ్డపై దుష్ప్రభావం చూపిస్తుంది.
Also read: Thyroid Control Tips: థైరాయిడ్ నియంత్రణలో అద్భుతంగా పనిచేసే సూపర్ ఫుడ్స్ ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Banana Milk Shake: బనానా మిల్క్ షేక్ ఎవరెవరు తాగకూడదు, అరటిపళ్లు, పాలు కలిపి తీసుకుం