Toor Dal Seed Coat For Calcium: మన శరీరానికి కావాల్సిన అతి ముఖ్యమైన పోషకాలలో కాల్షియం ఒకటి. ఇది శరీరం దృఢత్వంగా ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా ఇది ఎముకలు, దంతాలు గట్టిగా ఉండటానికి దోహాదపడుతుంది. కాల్షియం లోపం (Calcium deficiency) ఉన్నవారు బలహీనంగా ఉంటారు. ఏ పని చేయాలన్నా బాడీ సహకరించదు. ఇది రక్త గడ్డకట్టడం, కండరాలను బలోపేతం చేయడం, గుండె కొట్టుకోవడం మరియ నాడీ వ్యవస్థ సక్రమంలో పనిచేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది.
పరిశోధనలో వెల్లడి
మీ శరీరంలో కాల్షియం తగ్గిందంటే ఎక్కువ మంది పాలు తాగమని చెబుతారు. కానీ తాజా అధ్యయనంలో, పొట్టు తీసిన కంది పప్పులో చాలా కాల్షియం ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది సెమీ-ఎరిడ్ ట్రాపిక్స్ (ICRISAT) అధ్యయనం ప్రకారం, కంది పప్పు పొట్టులో పాలలో కంటే 6 రెట్లు ఎక్కువ కాల్షియం ఉన్నట్లు తేలింది. కేవలం 100 గ్రాముల కంది పప్పు పొట్టులో 652 మిల్లీగ్రాముల కాల్షియం ఉన్నట్లు గుర్తించారు. అయితే 100 మిల్లీలీటర్ల పాలలో 120 మిల్లీగ్రాముల కాల్షియం మాత్రమే ఉన్నట్లు వారు పేర్కొన్నారు. సాధారణంగా మన శరీరానికి ప్రతిరోజూ 800-1,000 mg కాల్షియం అవసరం. ఇప్పుడు కాల్షియం కోసం దేనిని తీసుకుంటారో మీ ఇష్టం.
కాల్షియం లభించే ఇతర పదార్థాలు
పెరుగు, రాజ్‌మా, రాగులు, శనగలు, పెసలు, నువ్వులు, చేపలు, బీన్స్ , సోయాబీన్, మెంతికూర, తోటకూర, పాలకూర, నారింజ, ఆకు కూరలు, బాదం, ఎండు ద్రాక్ష.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook