Stomache Infection: వర్షాకాలంలో అన్నీ సమస్యలే. ప్రధానంగా అనారోగ్య సమస్యలు అధికమౌతాయి. అందులో ప్రధానమైంది కడుపులో ఇన్‌ఫెక్షన్. కడుపులో ఇన్‌ఫెక్షన్ ఉంటే..ఆ సంకేతాలతో తెలిసిపోతుంది..
వర్షాకాలంలో వివిధ రకాల రోగాలు, ఇన్‌ఫెక్షన్ల ముప్పు వెంటాడుతుంటుంది. కలుషిత నీరు లేదా కలుషిత ఆహారం వల్ల ఇన్‌ఫెక్షన్ త్వరగా సోకుతుంది. ముఖ్యంగా కడుపుకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కడుపులో ఇన్‌ఫెక్షన్ అనేది వైరల్ లేదా బ్యాక్టీరియల్ సంక్రమితమై ఉంటుంది. ఫలితంగా తీవ్రమైన కడుపు నొప్పి ఉంటుంది. దీనినే గ్యాస్ట్రో ఎంటైటిస్ అని కూడా పిలుస్తారు. నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి విషమమవుతుంది. అందుకే కడుపుకు సంబంధించి ఏ లక్షణాలు కన్పించినా ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కడుపులో ఇన్‌ఫెక్షన్ ఉంటే కన్పించే లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం..
అదే పనిగా ఆగకుండా వాంతులు వస్తుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం కూడదు. పదే పదే వాంతులు వస్తుంటే అది కచ్చితంగా కడుపు ఇన్‌ఫెక్షన్ అవుతుంది. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇక మరో సమస్య కడుపులో ఇబ్బందిగా ఉండటం. ఇదేదో మామూలు విషయమని చాలామంది పట్టించుకోరు. కానీ విరేచనాలు, కడుపు పట్టేయడం వంటి లక్షణాలుంటే అది కూడా ఇన్‌ఫెక్షన్ కావచ్చు. బాడీ వెంటనే హైడ్రైట్ కావల్సిన అవసరముంటుంది.
కడుపులో ఇన్‌ఫెక్షన్‌కు మరో ప్రధాన లక్షణం కడుపు నొప్పి. నొప్పి తీవ్రంగా ఉండటమే కాకుండా కడుపులో తిప్పేసినట్టుంటుంది. ఈ రెండు లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అలాగని ప్రతి కడుపు నొప్పి ఇన్‌ఫెక్షన్ కాదు కూడా. ఇక మరో సమస్య మాంసకృతుల్లో నొప్పి. ఇది కూడా కడుపులో ఇన్‌ఫెక్షన్ కారణంగా వస్తుంది.
Also read: Ice cream in Monsoon: వర్షాకాలంలో ఐస్‌క్రీమ్స్ తినవచ్చా లేదా..ఏమౌతుంది
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook