రోజుకు ఒక గుడ్డు తినాలని వైద్యులు చెబుతుంటారు. గుడ్లలో పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. కానీ కొంతమంది మాత్రం గుడ్లకు దూరంగా ఉండాలి. ఎవరు తినకూడదు, కారణాలేంటనేది తెలుసుకుందాం..
గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్లు, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా ప్రయోజనకరం. గుడ్డు తినడం వల్ల ఎముకలు పటిష్టంగా మారతాయి. అటు ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. గుడ్డు ఆరోగ్యానికి ఎంత మంచిదైనా కొందరికి మాత్రం చేటు తెస్తుంది.
కిడ్నీ సంబంధిత సమస్యలున్నవారు గుడ్డు తినకూడదు. ఎందుకంటే గుడ్లు తినడం వల్ల కిడ్ని సంబంధిత సమస్యలు మరింతగా పెరుగుతాయి. కిడ్నీ వ్యాధిగ్రస్థులు గుడ్డుకు దూరంగా ఉండాలి.
అధిక బరువు ఉన్నవాళ్లు గుడ్డు తినకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే గుడ్లు తినడం వల్ల శరీర బరువు వేగంగా పెరిగిపోతుంది. గుడ్లలో ఉండే ప్రోటీన్లు బరువు పెరిగేందుకు దోహదం చేస్తాయి.
డయాబెటిస్ రోగులు కూడా గుడ్లు తినకూడదు. మధుమేహం సమస్య ఉన్నవాళ్లు గుడ్డులో ఎల్లో భాగం ఎట్టిపరిస్థితుల్లోనూ తినకూడదు. వైట్ తినవచ్చు. డయాబెటిస్ రోగులు గుడ్లకు దూరంగా ఉంటే మంచిది.
ఇక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవాళ్లు కూడా గుడ్లు తినకూడదు. గుడ్ల వల్ల కొలెస్ట్రాల్ సమస్య పెరుగుతుంది. ఒకవేళ తినాల్సి వస్తే..ఎల్లో కాకుండా..వైట్ తింటే ఫరవాలేదు.
Also read: Thyroid care Tips: రోజూ ఆ జ్యూస్ పరగడుపున తాగితే..కేవలం 21 రోజుల్లో థైరాయిడ్ మటుమాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook