Health benefits of Kalonji: కలోంజి గింజలను ఉపకుంచి , నల్ల జీలకర్ర అన్న పేరుతో కూడా పిలుస్తారు. అనాదిగా వీటిని ఆయుర్వేదంలో కూడా పలు రకాల మందులు తయారీకి ఉపయోగిస్తూ వస్తున్నారు. ఇది మన రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. సాధారణంగా శరీరాన్ని పట్టిపీడించే పలు రకాల ఇన్ఫెక్షన్స్ నుంచి ఇది మనల్ని కాపాడుతుంది. ఇన్ని ప్రయోజనాలు కలిగిన కలోంజీ సీడ్స్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
కలోంజి లో లభించే యాంటీ ఆక్సిడెంట్లు.. ఆక్సీకరణ వల్ల మన కణాలకు జరిగే నష్టాన్ని నిరోధించడంలో సహాయం చేస్తాయి. క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బు వంటి పలు రకాల సమస్యలకు ఉపశమనంగా పనిచేస్తాయి. రోజు కలోంజి గింజలు తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చూద్దాం..
గుండె పదిలం:
క్రమం తప్పకుండా కలోంజి గింజలు తీసుకోవడం వల్ల.. రక్తనాళాలు లో పేర్కొన్న కొలెస్ట్రాయి స్థాయి నియంత్రణలో ఉంటుంది. తద్వారా రక్తప్రసరణ మెరుగుగా జరగడం వల్ల గుండె ఆరోగ్యంగా, బలంగా ఉంటుంది.
మధుమేహం దూరం:
నల్ల జీలకర్ర మన రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. అయితే ఇవి తీసుకునే ముందు ఇవి మీకు సరిపడా లేదా అన్న విషయం పై ఒకసారి నిపుణులను అడిగి సలహా తీసుకోవడం మంచిది.
వెయిట్ లాస్:
ఈ విత్తనాల్లో శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించే శక్తి ఉంది అని కొన్ని అధ్యయనాల్లో తేలింది. దోరగా వేయించిన కలోంజీ విత్తనాలను పొడి చేసి..మీ సలాడ్స్ లో కలుపుకొని తినవచ్చు. ఇలా చేయడం వల్ల బరువు సులభంగా తగ్గుతారు.
మెమరీ పెరుగుదల:
కలోంజీ సీడ్స్ ను మిక్సీ కి వేసి దానిలో కొంచెం తేనె కలుపుకొని తింటే మన మెమరీ పవర్ కూడా పెరుగుతుంది.
ఆస్త్మా కి చెక్:
ఇక ఈ గింజలను వెచ్చటి నీటిలో కలిపి తీసుకుంటే ఆస్త్మా లక్షణాలు, శ్వాస సంబంధిత సమస్యలు చాలా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఐతే, ఇలా కనీసం 45 రోజుల పాటు పాటించాలి. ఈ పీరియడ్ లో చల్లటి పానీయాలను అస్సలు తీసుకోకూడదు.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం నిపుణుల సూచనల మేరకు సేకరించడం జరిగింది .కావున ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
Also Read: Belly Fat: బెల్లీ ఫ్యాట్ లేదా అధిక బరువు సమస్య వేధిస్తోందా..ఈ 3 అలవాట్లు మానండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook