Health Benefits Of Dates: చలి కాలంలో కొలెస్ట్రాల్‌ తగ్గడానికి దీని కంటే ఇంకో మంచి చిట్కా లేదు..!

Health Benefits Of Dates: చలి కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఖర్జూర పండ్లను ఆహారంలో వినియోగించాల్సి ఉంటుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 20, 2022, 02:17 PM IST
Health Benefits Of Dates: చలి కాలంలో కొలెస్ట్రాల్‌ తగ్గడానికి దీని కంటే ఇంకో మంచి చిట్కా లేదు..!

Health Benefits Of Dates: చాలా మంది చలి కాలంలో ఖర్జూర పండ్లను తినేందుకు ఇష్టపడుతారు. ఇవి తినడానికి రుచిగానే ఉండడం కాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. కాబట్టి శీతాకాలంలో తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా ఖర్జూర పండ్లను ఆహారంలో వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఫైబర్, ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి వీటిని తరచుగా తినడం వల్ల శరీరానికి మెగ్నీషియం, మాంగనీస్, ఇనుము, పొటాషియం అభిస్తుంది. అంతేకాకుండా చలి కాలంలో వీటిని తినడం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 
వీటితో ఈ అనారోగ్య సమస్యలకు చెక్‌:

జీర్ణక్రియకు సమస్యల నుంచి ఉపశమనం:
చలికాలంలో జీర్ణక్రియకు సంబంధించిన చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఖర్జూరను ఆహారంగా తీసుకోవాల్సి ఉంటుంది.  ఖర్జూరలో ఉండే ఫైబర్స్ అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.  ఖర్జూరం తినడం వల్ల మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా ఎసిడిటీ సమస్య నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.

రక్తాన్నిపెంచుతాయి:
ఖర్జూరా శరీరానికి చాలా రకాల లాభాలను అందిస్తుంది. ముఖ్యంగా రక్తహీనత సమస్యలతో బాధపడుతున్నవారికి ఇది ప్రభావవంతంగా పని చేస్తుంది. ఈ వ్యాధితో బాధపడేవారు ఖర్జూరాలను ప్రతి రోజులు తినడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు  కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి సహాయపడతాయి.

ఇన్ఫెక్షన్స్‌ రాకుండా నివారిస్తుంది:
ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి వీటిని తరచుగా తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా చలి కాలంలో ఖర్జూరం తినడం వల్ల జలుబు, ఫ్లూ వంటి వ్యాధులు సులభంగా దూరమవుతాయి. ఇన్ఫెక్షన్స్‌ రాకుండా శరీరాన్ని రక్షిస్తుంది.

మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది:
మెదడులో ఫలకాన్ని నివారించడానికి ఖర్జూరాలు ప్రభావవతంగా సహాయపడుతుంది. మెదడు ఆరోగ్యంగా ఉండేలా ఇవి సహాయపడతాయి. ఖర్జూరం తినడం వల్ల అల్జీమర్స్ వంటి వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

Also Read: Saphala Ekadashi 2022:  సఫల ఏకాదశి రోజున ఇలా చేస్తే.. జీవితాంతం లాభాలే..లాభాలు..

Also Read: Jammu And Kashmir Encounter: ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులు.. భారీ ఎన్‌కౌంటర్‌లో హతం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News