Ajwain Water: సర్వ రోగ నివారిణి, బెస్ట్ డీటాక్స్ డ్రింక్, రోజూ పరగడుపు తాగితే చాలు

Health Tips: ప్రతి భారతీయ కిచెన్‌లో తప్పకుండా లభించే వాముతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ప్రతి రోజూ క్రమం తప్పకుండా డైట్‌లో భాగంగా చేసుకుంటే చాలా రకాల సమస్యలు చేరకుండా చూడవచ్చు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 30, 2023, 07:40 AM IST
Ajwain Water: సర్వ రోగ నివారిణి, బెస్ట్ డీటాక్స్ డ్రింక్, రోజూ పరగడుపు తాగితే చాలు

Health Tips: మనిషి ఆరోగ్యానికి కావల్సిన వివిధ రకాల పోషకాలు చాలా వరకూ ప్రకృతిలో లభించే పదార్ధాల్లోనే ఉంటాయి. ఏవి ఎందుకు ఉపయోగపడతాయో తెలుసుకోగలగాలి. అన్నింటికీ మించి కిచెన్‌లో లభ్యమయ్యే వస్తువులు మనిషి ఆరోగ్యాన్ని సంరక్షించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.

ప్రతి వంట గదిలో తప్పకుండా లభించే మసాలా దినుసు వాము. వాముతో కలిగే పూర్తి ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు. వామును బెస్ట్ డీటాక్స్ డ్రింక్‌గా పరిగణిస్తారు. రోజూ పరగడుపున వాము తీసుకుంటే కలిగే ప్రయోజనాలు వింటే నోరెళ్లబెట్టడం ఖాయం. రోజూ ఉదయం లేచిన వెంటనే పరగడుపున వాము నీళ్లలో కొద్దిగా నిమ్మరసం పిండుకుని తాగితే ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. ఎలాంటి అనారోగ్యం దరిచేరదు. స్థూలకాయం నుంచి విముక్తి పొందవచ్చు. శరీరాన్ని అద్భుతంగా డీటాక్స్ చేసుకోవచ్చు.

వామును అద్భుతమైన యాంటీ వైరల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగిన ఆయుర్వేద ఔషధంగా భావిస్తారు. ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. అధిక బరువు సమస్యకు చెక్ పెట్టేందుకు వాము చాలా బాగా ఉపయోగపడుతుంది. మహిళల్లో పీరియడ్స్ సమయంంలో తలెత్తే నొప్పులు కూడా దూరమౌతాయి. మరోవైపు రక్త సరఫరా కూడా మెరుగుపడుతుంది. 

బెల్లీ ఫ్యాట్ సమస్యను పోగొట్టేందుకు వాము అద్భుతంగా ఉపయోగపడుతుంది. రోజూ క్రమ పద్ధతిలో వాము నీరు తాగడం అలవాటు చేసుకుంటే పొట్ట, నడుము చుట్టూ ఉండే కొవ్వు వేగంగా కరుగుతుంది. వాము నిమ్మరసం నీళ్లు రోజూ తాగితే శరీరంలోని అన్ని రకాల విష పదార్ధాలు బయటకు తొలగిపోతాయి. అంటే వాము నీళ్లు బెస్ట్ డీటాక్స్ డ్రింక్‌గా పనిచేస్తాయి. రోజూ పరగడుపున వాము నీళ్లలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగితే చర్మ సంబంధ సమస్యలు దూరమౌతాయి. చర్మాన్ని ఆరోగ్యంగా మార్చుతాయి. 

ఆయుర్వేద శాస్త్రంలో వాముకు చాలా ప్రాదాన్యత , విశిష్టత ఉన్నాయి. వాములో థయమాల్, ఫైబర్ వంటి పోషకాలు చాలా ఎక్కువ పరిమాణంలో ఉండటం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఏర్పడకుండా నియంత్రితమౌతుంది. వాము నిమ్మరసంతో గుండె సంబంధిత వ్యాధులు కూడా దూరం కాగలవు.  

Also read: Blood Sugar Test: బ్లడ్ షుగర్ పరీక్షలు ఎప్పుడెప్పుడు చేయించుకోవడం మంచిది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News