Sprouts Benefits: రోజు ఇవి తింటే శరీరం ఫిట్ గా కాదు.. 6 ప్యాక్ చాలా సులువుగా వస్తుంది

Health Benefits of Sprouts: ఆరోగ్యం అనేది పూర్తిగా మన ఆహారపు అలవాట్లపైనే ఆధారపడి ఉంటుంది. ప్రతిరోజూ బలవర్ధకమైన ఆహారం తీసుకుంటే  ఏ విధమైన అనారోగ్య సమస్యా ఉండదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 24, 2022, 01:46 PM IST
Sprouts Benefits: రోజు ఇవి తింటే శరీరం ఫిట్ గా కాదు.. 6 ప్యాక్ చాలా సులువుగా వస్తుంది

Health Benefits of Sprouts: రోజువారీ జీవితంలో దినచర్య ప్రారంభం ఆరోగ్యకరమైన ఆహారంతో జరిగితే..ఇక ఏ విధమైన అనారోగ్యం దరిచేరదు. దీనికోసం స్ప్రౌట్స్ చాలా కీలకపాత్ర పోషిస్తాయి. స్ప్రౌట్స్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

స్ప్రౌట్స్ గురించి ఇప్పుడు అందరికీ తెలుసు. బయట మార్కెట్‌లో ప్యాకెట్ల రూపంలో కూడా లభ్యమౌతున్నాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. ధాన్యం, పప్పుల్లో పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంటారు. స్ప్రౌట్స్ ఇందుకు బాగా దోహదపడతాయి. శరీరానికి అన్ని రకాల న్యూట్రియంట్ల లోపం పూడ్చాలంటే సోయాబీన్, పెసర వంటివాటిని రోజంతా నానబెట్టి తినాలి. ఇందులో విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. పెసర, సోయాబీన్స్, మోఠ్‌లలో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్ వంటి మినరస్ పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజూ సేవించడం వల్ల విటమిన్స్, మినరల్స్ లోపం పూర్తవుతుంది. స్ప్రౌట్స్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

ప్రతి రోజూ క్రమం తప్పకుండా స్ప్రౌట్స్ తీసుకుంటే..శరీరంలో ఇమ్యూనిటీ కచ్చితంగా పెరుగుతుంది. పోషక పదార్ధాలతో నిండిన ధాన్యాల్ని తీసుకోవడం వల్ల రోగాలతో పోరాడే శక్తి వస్తుంది. వాతావరణం మారిన ప్రతిసారీ ఆరోగ్యం పాడవదు. వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లు దరిచేరవు. 

మోఠ్, సోయాబీన్, పెసరలో విటమిన్స్, మినరల్స్ తగిన మోతాదులో ఉంటాయి. ఇందులో మెగ్నీషియం కూడా లభిస్తుంది. రోజూ వీటి స్ప్రౌట్స్ తినడం వల్ల మజిల్స్ పటిష్టంగా మారతాయి. మజిల్ పెయిన్స్ దూరమౌతాయి. ఇందులో ఉండే పొటాషియం, ఫైబర్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఫైబర్ కారణంగా మలబద్ధకం వంటి సమస్య కూడా దూరమౌతుంది. 

సోయాబీన్, పెసర, మోఠ్ స్ప్రౌట్స్ తినడం చర్మానికి చాలా మంచిది. ముఖంపై పింపుల్స్, ముడతలు కూడా దూరమౌతాయి. నానబెట్టి తీసుకోవడం వల్ల ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాల్ని మెరుగుపరుస్తాయి. స్ప్రౌట్స్ అనేవి కేవలం ఆరోగ్య పరిరక్షణకే కాకుండా బరువు తగ్గించేందుకు కూడా దోహదపడతాయి. 

Also read: Skin Care Tips: ఈ మిశ్రమం ఓ వారం రోజులు రాస్తే చాలు..అందంతో నిగనిగలాడిపోతారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News