Hair Loss Issues: పురుషుల్లో జుట్టు రాలే అంశంపై చర్మ వ్యాధి నిపుణులు అధ్యయనాలు చేశారు. ఇది యువతలో కనిపించే సాధారణ ఆందోళన అని చర్మ వ్యాధి నిపుణుడు డాక్టర్ సుసాన్ మాసిక్ తెలిపారు. జీవన శైలిని మార్చుకోవడమే జుట్టు రాలడాన్ని నివారించేందుకు ఉత్తమ మార్గమన్నారు. షాంపూలు కంటే మినోక్సిడిల్ వంటి మందులు వాడితే ఈ సమస్యను అధికమించవచ్చని అంటున్నారు. మగవారి బట్ట తలకు చిక్సిత లేదని..ఐతే కొన్ని జాగ్రత్తలతో జుట్టును పెంచుకునే అవకాశం ఉందన్నారు.
జట్టు రాలే సమస్య అధికంగా యువకుల్లో ఉందని..సాధ్యమైనంత ఎక్కువ జుట్టును ఉంచుకోవాలంటే ముందస్తు జాగ్రత్త అవసరమని అభిప్రాయపడుతున్నారు. రెండు పద్దతుల ద్వారా ఈసమస్యను అధికమించవచ్చని స్పష్టం చేస్తున్నారు చర్మ వ్యాధి నిపుణుడు డాక్టర్ సుసాన్ మాసిక్. సమతుల్య ఆహారం, సమయోచిత మినోక్సిడిల్ మందులు వాడితే బట్ట తల సమస్య రాదంటున్నారు. జుట్టు రాలడానికి ఒత్తిడి ప్రధాన కారణంగా ఉంది.
అలోపేసియా అరేటా అని పిలువబడే స్వయం ప్రతిరక్షక వ్యాధి నుంచి రావొచ్చు అంటున్నారు. ఐతే చాలా మందిలో ఆండ్రోజెనిక్ అలోపేసియా, మేల్ ప్యాట్నన్ బట్టతల ఉందని వెల్లడించారు. 25 శాతం మంది పురుషులు 21 ఏళ్లకు ముందే జుట్టు రాలే సమస్యతో పడుతున్నారు. మరో 70 శాతం మంది వయస్సు పెరిగే కొద్ది జుట్టు రాలిపోతూ ఉంటుంది. బట్టతల రావడానికి డైహైడ్రోటెస్టోస్టెరాన్, డిహెచ్టి హార్మోన్ వల్ల వస్తుందంటున్నారు.
దీని వల్ల జుట్టు కుదుళ్లు కుంచించుకుపోతాయి. డైహైడ్రోటెస్టోస్టెరాన్, డిహెచ్టి హార్మోన్‌తో జుట్టు సన్నగా పెరుగుతుందని అంటున్నారు. సులభంగా రాలిపోయే సూచనలు ఉన్నాయని చర్మ వ్యాధి నిపుణుడు డాక్టర్ సుసాన్ మాసిక్ తెలిపారు. మగవాళ్లల్లో అధికంగా తల పైభాగంలో ఈ సమస్య కనిపిస్తుందంటున్నారు. ప్రోటీన్, ఇనుము అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే జుట్టు ఆరోగ్యంగా, బలంగా ఉంటుందని స్పష్టం చేశారు.
చికెన్, గుడ్లు, పెరుగు, గొడ్డు మాంసం వంటి ఆహారాల్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల జుట్టు కుదుళ్లను తయారు చేస్తుంది. ప్రోటీన్ల్లో ఐరన్ కూడా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు సంబంధించిన కణాలకు ఆక్సిజన్ తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. సాధ్యమైనంత వరకు జుట్టుపై తక్కువ ఒత్తిడి పెట్టాలంటున్నారు. పెర్మ్లు, ఎక్స్ టెన్షన్లు, హెయిర్ స్ట్రెయిటనింగ్ వంటి హెయిర్ స్టైల్స్ ..జట్టుపై ఒత్తిడి కల్గించే అవకాశం ఉందంటున్నారు.
యువకులు ఉపయోగించే హెయిర్ స్టైలింగ్ కూడా జుట్టు రాలే సమస్యకు పరిష్కారం చూపుతుందని డాక్టర్ సుసాన్ మాసిక్ వెల్లడించారు. షాంపూలు ఉపయోగిస్తే జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టవచ్చని అంటున్నారు. టాపికల్ మినోక్సిడిల్..జట్టు రాలడాన్ని నివారిస్తుందని చెప్పారు. ఔషధాలు ఉపయోగించడం అత్యంత ముఖ్యమన్నారు.
Also read:Indian Railway Tickets: ట్రైన్లో టాయిలెట్ పక్కన బెర్త్ రాకుండా టికెట్ ఇలా బుక్ చేసుకోండి..!
Also read:Munugode By Election : మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి