Guava for Weight Loss In 7 Days: ప్రస్తుతం భారత్‌లో శీతాకాలం మొదలైంది. ఈ సీజన్‌లో తాజా పచ్చి కూరగాయలు మార్కెట్‌లో విచ్చల విడిగా లభిస్తాయి. శీతాకాలంలో చాలా మంది నోటికి రుచిన కలిగించే ఆహారాలను తీసుకునేందుకు ఇష్ట పడతారు. దీని కారణంగా బరువు పెరిగే అవకాశాలున్నాయి. అయితే ఎలాంటి ఆహారాలు తీసుకున్న బరువు పెరగకుండా, శరీర బరువు సులభంగా తగ్గడానికి జామ కాయలను ఆహారంలో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
జామకాయలో విటమిన్లు, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, పొటాషియం అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని శీతాకాలంలో ప్రతి రోజూ తినడం వల్ల శరీర బరువును తగ్గించి.. సంతానోత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచేందుకు సహాయపడతాయి.
జామ కాయలను తినడం వల్ల ఎలా బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం..
>>జామపండులో పీచు పరిమాణాలు అధికంగా ఉంటుంది. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే జీర్ణక్రియ మెరుగు పడి బరువు తగ్గుతారు.
>>ఈ పండులో తక్కువ పరిమాణంలో కార్బోహైడ్రేట్ ఉంటుంది. 100 జామపండ్లలో దాదాపు 14 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కాబట్టి వీటిని ప్రతి రోజూ తినడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడతాయి.
>> ఇందులో కేలరీల పరిమాణాలు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి సులభంగా శరీర బరువును తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తాయి.
>>జామలో ఉండే ప్రోటీన్ ఆకలి హార్మోన్ 'గ్రెలిన్'ను నియంత్రిస్తుంది.
>>జామపండులో B1, B3, B6, ఫోలేట్ వంటి B విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి జామపండు తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
Also Read: Chiru Vs Balayya: అన్ని విషయాల్లో బాలయ్యను డామినేట్ చేస్తున్న చిరు.. ఆ దెబ్బతో సినిమా కూడా ముందే?
Also Read: Samantha Hugs: అతని కౌగిట్లో సమంత.. ఈరోజు వస్తుందని ఊహించలేదంటూ పోస్ట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook