Green Tea Side Effects: గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ అతిగా తాగితే మాత్రం అనర్ధాలే. మరి రోజుకు ఎన్ని కప్పుల గ్రీన్ టీ తాగాలనే వివారాలు ఇప్పుడు తెలుసుకుందాం..
గ్రీన్ కేవలం ఆరోగ్యానికే కాదు..బరువు తగ్గేందుకు కూడా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. బరువు తగ్గేందుకు నిజంగానే గ్రీన్ టీ అద్భుతమైన ఔషధంగా ఉపయోగపడుతుంది. అయితే అతి ఏదైనా అనర్దమే అన్నట్టు..గ్రీన్ టీ అతిగా తాగితే నష్టాలు కలుగుతాయి. ఈ క్రమంలో రోజుకు ఎన్ని కప్పుల గ్రీన్ టీ తాగాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..
గ్రీన్ టీ అతిగా తాగితే కలిగే నష్టాలు
గ్రీన్ టీ ఎక్కువగా తీసుకుంటే శరీరంలో కెఫీన్ శాతం పెరిగిపోతుంది. ఫలితంగా నిద్రలేమి, డీహైడ్రేషన్, వాంతులు వంటి సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. గ్రీన్ టీ అతిగా తాగడం వల్ల మాంసపుకృతులు బలహీనమౌతాయని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. గ్రీన్ టీ అధికంగా సేవించడం వల్ల కడుపుకు సంబంధించిన సమస్యలు వెంటాడుతాయి. కెఫీన్ ఎక్కువ కావడం వల్ల ఈ సమస్యలు ఎదురౌతాయి.
రోజుకు ఎన్ని కప్పుల గ్రీన్ టీ అసరం
రోజుకు 2-3 కప్పుల గ్రీన్ టీ తాగవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకంటే ఎక్కువ గ్రీన్ టీ సేవిస్తే దుష్పరిణామాలు ఎదురౌతాయంటున్నారు. అదే సమయంలో ఎంతమొత్తం తాగాలనేది ఆ వ్యక్తి వయస్సు, ఆరోగ్యంపై కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే వైద్య నిపుణుల సలహా మేరకే ఎన్ని కప్పుల గ్రీన్ టీ తీసుకోవాలనేది నిర్ణయించుకోవాలి.
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook