Gourd Benefits for health: సోరకాయలో నీరు శాతం అధికంగా ఉంటుంది. కావున వేసవి కాలంలో వీటిని తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వాస్తవానికి చాలా మందికి ఈ కూరగాయ అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇది రుచిని కలిగి ఉండదు. అయితే నిపుణులు మాత్రం వీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇందులో ఉండే నీటి శాతం శరీరాన్ని డీహైడ్రెషన్ నుంచి రక్షించి.. వేసవి కాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి సంరక్షిస్తుందని నిపుణులు పేర్కొన్నారు.
దీన్ని తినడం వల్ల ఈ ప్రయోజనాలు లభిస్తాయి:
1. బరువు తగ్గడం:
సులువుగా బరువు తగ్గాలనుకునే వారు క్రమం తప్పకుండా వీటిని వండుకొని తినాలని నిపుణులు చెబుతున్నారు. ఇది బరువును తగ్గించడమే కాకుండా.. అనేక వ్యాధుల నుంచి శరీరాన్ని సంరక్షిస్తుంది.
2. ఆరోగ్యమైన పొట్టకోసం:
ప్రస్తుతం చాలా మంది పొట్టలో నొప్పులు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. దీనిని ఆహారంగా తీసుకుంటే జీర్ణవ్యవస్థ కూడా బలపడుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు.
3. గుండె ఫిట్‌గా ఉంటుంది:
మారుతున్న జీవనశైలి కారణంగా గుండెను సంబంధిత సమస్యలు రాకుండా చూసుకోవడం చాలా మేలు. దీని కోసం సోరకాయ వంటి కూరగాలను ఆహారంలో వినియోగించుకోవాలపని నిపుణులు చెబుతున్నారు.
4. చర్మానికి మేలు చేస్తుంది:
ఈ సోరకాయలో నీరు శాతం అధికంగా ఉండడం వల్ల చర్మానికి మేలు చేస్తుంది. అంతేకాకుండా చర్మ సమస్యలు దూరమవుతాయి.
5. ఒత్తిడిని తగ్గిస్తుంది:
ఒత్తిడి అనేది ఈ రోజుల్లోసాధరణమైంది. ప్రతి ఒక్కరూ ఈ సమస్యకు గురవుతున్నారు. దీని నుంచి విముక్తి పొందడానికి యోగా, మరికొందరు వ్యాయామం చేస్తుంటారు. కానీ ఇవి ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోతున్నాయి. అయితే సోరకాయను క్రమం తప్పకుండా తింటే ఈ సమస్య దూరమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Weight Loss Tips: టిఫిన్‌గా శనగపిండితో చేసిన వీటిని తినండి.. శరీరానికి చాలా శక్తిని ఇస్తుంది.!
Also Read: Video: సైకిల్ తొక్కుతూ కింద పడిపోయిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook